ఎప్పుడు క్లాస్ గా కనిపించే హీరో ఒక్కసారి మాస్ అవతారం ఎత్తితే? ఊహిస్తేనే గూస్ బంప్స్ రావడం ఖాయం.మరి మన టాలీవుడ్ లో న్యాచురల్ స్టార్ నాని ( Nan i) కూడా ఇప్పటి వరకు క్లాస్ హీరోగా మెప్పించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు క్లాస్ ను పక్కన పెట్టి మరీ మాస్ అవతార్ లోకి మారిపోయాడు.నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా”( Dasara ).
ఈ సినిమాలో నాని లుక్ ఇప్పటికే బయటకు వచ్చి ఆకట్టుకోగా ఈ మూవీ కోసం నాని చాలా కష్టపడ్డాడు.తనని తాను మాస్ హీరోగా కూడా నిరూపించు కునేందుకు దసరా సినిమానే కరెక్ట్ అని భావించి నాని ఈ సినిమాను చేస్తున్నాడు.
అందులోనూ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా మంచి అంచనాలతో ఎదురు చూస్తుంది.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ ( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలలోనే నటించారు.రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.
మరి ఇప్పటికే ప్రమోషన్స్ తో ఆల్ ఓవర్ ఇండియాలో దుమ్ము రేపుతుండగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ (DASARA Pre Release Event) కూడా ఘనంగా చేసారు.ఈ ఈవెంట్ లో నాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
”దసరా సినిమాతో మీ గుండెల్ని హత్తుకునే మాస్ చూపిస్తాను.సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి థాంక్స్.మార్చి 30వ తేదీన మీకు మేము టాప్ లేచిపోయే సినిమాను ఇస్తున్నాం.టాప్ లేచిపోయే రెస్పాన్స్ మీరు మాకు ఇవ్వండి” అంటూ నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఆది పినిశెట్టి కీలక రోల్ చేస్తుండగా ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.