డేటా చోరీ అయిన కేసులో సిట్, పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.దేశ వ్యాప్తంగా సుమారు 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటాను కొందరు కేటుగాళ్లు చోరీ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే.ఈ చోరీ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో భాగంగా నిందితులు డేటాను ఎకవరెవరికీ విక్రయించారనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు.
కాగా సంవత్సర కాలంగా నిందితులు ఈ దందాను కొనసాగిస్తున్నారని గుర్తించారు.అదేవిధంగా చైనా సైబర్ నేరగాళ్లకు డేటా చేరిందా అనే అంశంపై కూడా సిట్ ఆరా తీస్తుంది.