ట్రంప్ దెబ్బకి భారతీయ ఎన్నారై లు ఒక్కొక్కరుగా ఆందోళన చెందుతున్నారు.వాస్తవానికి చెప్పాలంటే నిద్రపట్టని రోజులు గడుపుతున్నారని చెప్పాలి…అయితే తాజా అధ్యయనాలు అయితే షాకింగ్ నిజాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో హెచ్1బి వీసాపై వచ్చిన ఉద్యోగుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ని జారీ చేసే విషయంలో ట్రంప్ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు అందరికి తెలుసు అయితే ఇదే జరిగితే భారతీయులు చాలా మంది స్వదేశాలకి తిరిగి వచ్చేయాల్సిందే.అయితే
ఇవన్నీ తెలిసిన విషయాలే కదా కొత్తగా ఏముందు అనుకోకండి ఇదే విషయాన్ని తాజా అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి.టెన్నెస్సీ విశ్వవిద్యాలయానికి చెందిన క్రిస్టోఫర్ జేఎల్ కన్నింగ్‌హామ్, కెమ్మీ బిజినెస్ స్కూల్‌కు చెందిన పూజ బి విజయ్‌కుమార్ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలువడ్డాయి.హెచ్1బి, హెచ్4 వీసాల విషయంలో ట్రంప్ తన నిర్ణయాన్ని యధాతథంగా అమలు చేస్తే దాదాపుగా లక్ష మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోతారని ఈ అధ్యయనంలో తేలింది.
ఈ సర్వే కోసం ఏకంగా 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో వారు మాట్లాడిన తర్వాత, తుది నివేదిక కోసం 416 మంది అభిప్రాయాలను పరిగణలోనికి మరీ అధ్యయనం చేశారు.ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది భారతీయులు అమెరికాను వదిలి స్వదేశానికి వెళ్లడానికి దాదాపు సిద్దపడ్డారని తెలుస్తోంది మరోవైపు అమెజాన్, గూగుల్ వంటి పలు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాసుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సేకరించం కూడా మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఏది ఏమైనా ట్రంప్ తానూ ఇచ్చిన హామేలని అమలు చేయడానికి ఎంతో మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు అంటూ ఎంతో మంది మేధావులు విమర్శలు చేస్తున్నారు.