'వలసల' పై ట్రంప్ కీలక ఆదేశాల..!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.అమెరికాలోకి ప్రవేశించాలని అనుకునే వారు తప్పకుండా చట్టబద్దంగా వచ్చే వారికి మాత్రమే అనుమతులు ఇవ్వాలని తెలిపారు.

 Trump New Rule On Immigrants In America-TeluguStop.com

తన నిర్ణయం కోసం లక్షలాదిమంది ప్రజలు వేచి చూస్తున్నారని అన్నారు.ఉత్తర కరోలినాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ అమెరికా సరిహద్దులు బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఇదిలాఉంటే డెమాక్రట్లకు పై ట్రంప్ విరుచుకు పడ్డారు.మీరు గనుకా డెమాక్రట్లకు ఓటు వేస్తే సరిహద్దుల నుంచీ వలసలని అమెరికాలోకి ఆహ్వనిన్చినట్టే అని పేర్కొన్నారు.పన్నులు పెంచే వారికి మద్దతు ఇవ్వకూడదని అన్నారు.సరిహద్దులను అందరికీ స్వాగతంపలికే విధంగా ఉంచితే ఏమి జరుగుతుందో ప్రజలకి తెలుసునని అన్నారు.ఈ విధంగా చేస్తే తాను విఫలనాయకుడవుతానన్నారు.

అంతేకాదు మెక్సికోతో ఉన్న దక్షిణ సరిహద్దు వద్ద మిలిటరీ బలగాలను మెహరించడాన్ని ఆయన సమర్ధించుకున్నారు సమర్థించారు.మూడు అమెరికా దేశాల నుంచి ఏడు వేల మంది అమెరికాలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారని వీరిలో దక్షిణాసియాకు చెందిన కొంత మంది ప్రజలు ఉన్నారన్నారు.మన అమెరికా చట్టాలు అపహాస్యం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని ట్రంప్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube