నేనొస్తానంటే నువ్వొద్దంటావా ..? జగన్ నో చెప్పడం పై 'గాలి' ఆవేదన

వేర్వేరు పార్టీలో ఉన్నా గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్ లకు మధ్య గాఢానుబంధం ఉంది.కర్నాటక రాజకీయాలను ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి శాసిస్తున్నారు.

 Gali Janardhan Reddy Unhappy With The Ys Jagan Decision-TeluguStop.com

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించడానికి వైయస్ జగన్ ప్రయత్నిస్తున్నారు.వీరి ఇద్దరి అనుబంధం ఇప్పటిది కాదు.

వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుండగా .ఆయన అధికారంలో ఉండగా గాలి హవా ఏపీలో నడిచింది.ఒకానొక సందర్భంలో జగన్ తన ప్రాణమని కూడా గాలి చెప్పుకున్నాడు.ఆ తరువాత పరిస్థితుల ప్రభావంతో గాలి జగన్ బంధం దూరం అవుతూ వచ్చింది.అయితే ఇటీవల జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్న గాలి ఆయన్ను పరామర్శించడానికి హైదరాబాద్ చేరుకున్నారు.అయితే ఆయనకు అక్కడ చుక్కెదురయినట్టు సమాచారం.

అయితే తనను పరామర్శించడానికి గాలి వస్తున్నారన్న సమాచారం అందుకున్న జగన్ ఆయన్ను ఆసుపత్రికి రాకుండా అడ్డుకున్నారని, తనను పరామర్శించాలి అనుకున్నందుకు గాలికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జనార్దన్‌రెడ్డి తన వద్దకు వచ్చి యోగక్షేమాలు తెలుసుకుని వెళితే.మనిద్దరి బంధం మీద అనేక కథనాలు అల్లుతారని జగన్ ఆయనకు కబురు పంపి ఆయన రాకుండా అడ్డుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయంలో గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది.

అయిన వారు ఆపదలో ఉంటే పరామర్శించాలనుకోవడం కూడా తప్పేనా .? రాజకీయాలు పేరు చెప్పి జగన్ నన్ను దూరం పెడుతుండడం తాను తట్టుకోలేకపోతున్నానని ఆయన జగన్ సన్నిహితుల దగ్గర వాపోతున్నాడట.జగన్‌ కోసం గాలి ఆరాట పడుతున్నా యువనేత ఎడంగా ఉండటం వారిద్దరినీ అభిమానించే వారికి బాధ కలిగిస్తోంది.

జనార్దన్‌ రెడ్డి కనుక ఈ తరుణంలో జగన్‌ను కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మంచి ఊపు ఉండేదని కూడా గాలి అనుచరులు అభిప్రాయపడుతున్నారు.కానీ ఈ విషయంలో జగన్ మాత్రం రాజకీయ విమర్శలకు బయపడి వెనుకడుగు వేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube