ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అందలం ఎక్కినా తరువాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో మందిని ఇబ్బంది పెడుతున్నాయి.అతడి నిర్ణయాలు స్వదేశంలో ఉండే వారు సైతం అభ్యంతరం చెప్తున్నారు.
అధ్యక్షా హోదాలో ఉంటూ తాను తీసుకునే నిర్ణయాలకి ప్రపంచ దేశాలు సైతం విస్మయం చెందుతున్నాయి.ఇలాంటి నిర్ణయాలు బహుశా అమెరికా చరిత్రలో ఎవరూ తీసుకుని ఉండరూ కూడా.గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు సైతం ట్రంప్ ని తప్పుబడుతున్నారు అంటే అతడి నిర్ణయాలు ఎంతటి తేవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు
అయితే తాజగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభలో చుక్కెదురయ్యింది.ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు గురువారం ప్రతినిధుల సభలో వీగిపోయింది.దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటాను రద్దు చేయడంతో పాటు భారత్ వంటి వర్ధమాన దేశాల పౌరులు చట్టబద్ధంగా అమెరికాకు వలస వెళ్లేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపర్చిన సంగతి తెలిసిందే.రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బాబ్ గుడ్‌లాటె ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అనుకూలంగా 121 ఓట్లు.
వ్యతిరేకంగా 301 ఓట్లు పడ్డాయి.
ఇక్కడ మరొక షాకింగ్ న్యూస్ ఏమిటంటే.
ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేయాలని ముందుగా ఇరు పార్టీ సభ్యులకి ట్రంప్ విజ్ఞప్తి చేసినా సరే ఎవరూ కూడా పట్టించుకోక పోవడంతో రిపబ్లికన్లు ఏకపక్షంగా ప్రవేశపెట్టిన మరో బిల్లు ఓటమిపాలైందని డెమొక్రటిక్ పార్టీ విప్ హోయర్ వ్యాఖ్యానించారు…అయితే ఈ బిల్లు పాస్ అవ్వాలంటే ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమయ్యేలా బిల్లులో మార్పులు చేయడమే మిగిలిన ఏకైక మార్గమని మరో సభ్యుడు టాడ్ షూల్టె అన్నారు.