అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ -4 వీసా “వర్క్ పర్మిట్ ” రద్దు పై ఇక నాన్చుడు పద్దతి మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చేశాడు.హెచ్ -4 రద్దు తప్పదని తెగేసి చెప్పాడు.
ట్రంప్ ఈ ప్రకటనతో ఒక్కసారిగా భారతీయులు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు.ఈ వర్క్ పర్మిట్ వీసా రద్దు ప్రక్రియ చివరి దశకి చేరుకుందని ఓ అధికారి యూఎస్ న్యాయ స్థానానికి తెలిపారు.
వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు ఈ హెచ్-4 EAD ద్వారా వివిధ కంపెనీల్లో పని చెయ్యొచ్చు అనే నిభందన ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అయితే ఈ విధానాన్ని రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది.దీన్ని వ్యతిరేకిస్తూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అయితే న్యాయస్థానానికి ఆ అధికారి చెప్పిన జవాబు ఇప్పుడు అందరిని అయోమయంలో పడేసింది…అయితే కోర్టులో తుది తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానే వస్తుందని…అయితే ఈ తీర్పు తరువాత చట్టానికి లోబడి అందరు తమ దేశం వదిలి వెళ్ళవలసి ఉంటుంది అయితే వారికి కొంత సమయాన్ని కేటాయిస్తామని ఆ అధికారి తెలిపారు.
.told a federal appeals court yesterday that it's in the final stages of putting together a proposal to rescind the program.
Proposed rule has to be cleared with OMB, so will probably come out next month sometime.
— Laura D.Francis (@lauradfrancis)
I spent 300K dollars in the US on my education and I am a dentist practicing under my H4EAD.Not skilled enough I s’pose eh ?
— Aarthi Raghavan (@Raghavan_rt)
Disappointing news.We are supporting economy, paying taxes.We got chance to support our family.Don't take away our happiness and peace.Please support H4 EAD
— Priya (@Priyacad)
అయితే ఈ హెచ్-4 వర్క్ పర్మిట్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)ని వివరణ కోరింది…అయితే డీహెచ్ఎస్ అందించిన వివరాల తరువాత అక్కడి నుంచీ వచ్చిన క్లియరెన్స్ ప్రకారం దాన్ని ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు పరిశీలన నిమిత్తం పంపిస్తామని ట్రంప్ యంత్రాంగం కోర్టుకు తెలియజేసింది.ఏది ఏమైనా సరే హెచ్-4 వర్క్ పర్మిట్ రద్దు ప్రభావం అధికశాతం భారతీయులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అనడంలో సందేహం లేదు అంటున్నారు విశ్లేషకులు.