టీమిండియా కుర్రాళ్ళు ఇరగదీశారు... శతకాలతో చెలరేగిపోయారు!

రంజీ ట్రోఫీ 22-23 సీజన్లో మనోళ్లు అదరగొడుతున్నారు.దానిలో భాగంగా మొన్న అనగా జనవరి 3న మొదలైన గ్రూప్ మ్యాచ్ నిన్న అనగా రెండో రోజు రెచ్చిపోయి ఆడారు.

 Tripura Vs Chandigarh Ranji Trophy Match Highlights,tripura,ranji Trophy,ranji T-TeluguStop.com

అవును, కొందరు అంతర్జాతీయ ఆటగాళ్లు సెంచరీలతో తెగబడ్డారు.ఆ వివరాలేమిటో ఇపుడు వరుసగా చూద్దాము.

త్రిపురతో జరుగుతున్న మ్యాచ్ లో చండీఘర్ ఆటగాడు మనన్ వోహ్రా ద్విశతకం (200)తో చెలరేగిపోయాడు.అదే జట్టులో ఆడిన కునల్ మహాజన్ 162 పరుగులు చేసి అజేయమైన శతకం సాధించాడు.

అలాగే ఒడిశాతో జరుగుతున్న మ్యాచ్ లో నాగాలాండ్ ఆటగాడు చేతన్ బిస్త్ 129 కొట్టి సెంచరీని తనఖాతాలో వేసుకున్నాడు.
ఇక బెంగాల్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ ఉత్తరాఖండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 165 కొట్టి ఆహుతులను అలరించాడు.

అరుణాచల్ ప్రదేశ్ ఆటగాడు అనుప్ అహ్లావత్ మేఘాలయలో జరుగుతున్న మ్యాచ్ లో 123 కొట్టాడు.ఐతే అంతకు మునుపు మేఘాలయ ఆటగాళ్లు కిషన్ 128 కొత్తగా పునిత్ బిస్త్ 215, తారిఖ్ సిద్దిఖీ (102 నాటౌట్)తో అదరగొట్టారు.

అలాగే విదర్భతో జరుగుతన్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ 121 సాధించాడు.ఇక జమ్మూ అండ్ కశ్మీర్ జరుగుతున్న మ్యాచ్ లో రైల్వేస్ ఆటగాడు మహ్మద్ సైఫ్ (233) డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు.

ఈ లిస్టు చూస్తే చాలా పెద్దదే ఉంటుంది.పంజాబ్ ఆటగాడు నెహాల్ వధేరా 123, రాజస్తాన్ ఆటగాడు కరణ్ లాంబా 122, కేరళ ఆటగాడు R ప్రేమ్ 112, బరోడా కెప్టెన్ విక్రమ్ సోలంకి 178, హిమాచల్ ఆటగాడు ప్రశాంత్ చోప్రా 111, మహారాష్ట్ర ఆటగాడు కేధార్ జాదవ్ 142, సౌరాష్ట్ర ఆటగాళ్లు హార్విక్ దేశాయ్ 107, అర్పిత్ వసవద (127నాటౌట్) సాధించారు.అలాగే తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ (162) కొట్టాడు.ఇక అశుతోష్ 135, కర్ణాటక కెప్టెన్ మయాంక్ ఆగర్వాల్ (102 నాటౌట్)తో రాణించారు.

ఇలా ఎవరి మ్యాచ్ లో వారు ఇరగదీసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube