రోడ్డు దాటుతున్న పులి కోసం ట్రాఫిక్ ఆపేసిన కానిస్టేబుల్.. వీడియో వైరల్!

తాజాగా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఒక పెద్దపులిని రోడ్డు దాటించడానికి ఇరువైపులా వాహనదారులను నిలిపివేశాడు.ఆ తర్వాత పులి మెల్లగా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయింది.

 Viral Traffic Police Stop Cars As A Tiger Crosses The Highway, Viral, Traffic P-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోకి ఇప్పటికే రెండు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి.

సాధారణంగా అడవి లేదా పెంపుడు జంతువులతో మనుషులకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంటుందని చెప్పవచ్చు.కష్టాల్లో ఉన్న వాటికి చేతనైనంత సహాయం చేసేందుకు వారు ఎప్పుడూ కూడా ముందుంటారు.

ఇప్పటికే ఎన్నో జంతువుల ప్రాణాలను కాపాడి చాలా మంది తమ సహృదయాలను చాటుకున్నారు.ఇప్పుడు మనం దీని గురించి ఎందుకు చర్చిస్తున్నామంటే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా ఓ పులిని వాహనాలు ఢీ కొట్టడకుండా కాపాడాడు.

నిజానికి అడవుల గుండా వెళ్లే హైవేలపై రోడ్డు దాటేటప్పుడు ఎన్నో జంతువులు మరణిస్తుంటాయి.ఈ పులికి అలాంటి ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీస్ చాలాసేపు వాహనదారులను స్టాప్ చేశాడు.

ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు, “పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్.ఈ వ్యక్తులు చాలా మంచివారు.

ఈ వీడియో తీసిందెక్కడో తెలియరాలేదు” అని ఒక క్యాప్షన్ జోడించారు.వైరల్ అవుతున్న వీడియో లో ప్రయాణికులు రోడ్డుకు ఇరువైపులా తమ వాహనాల్లో వెయిట్ చేయడం చూడవచ్చు.

ఆపై ట్రాఫిక్ పోలీసు ట్రాఫిక్‌ను నిలిపివేస్తుండగా, ఒక పులి నడుచుకుంటూ రోడ్డు దాటుతోంది.పోలీసు హెల్ప్ చేయడంతో ఆ టైగర్ ప్రశాంతంగా వెళ్లిపోయింది.

ఈ ఘటనలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పులి ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు, అది తన దారిన తాను చాలా ప్రశాంతంగా వెళ్లిపోయింది.ప్రయాణికులు కూడా అది రోడ్డు క్రాస్ చేసేంతవరకు ఓపికగా వేచి చూసారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube