“ఫోర్బ్స్” జాబితాలో...“భారత ఎన్నారై”

భారత ఎన్నారైలు ప్రపంచ దేశాలలో భారతీయల సత్తాని చాటుతుండటం పరిపాటే ఎన్నో రంగాలలో వారి వారి ప్రతిభని చాటుతూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.అయితే తాజాగా గల్ఫ్ వెళ్లి స్థిరపడిన ఒక భారత ఎన్నారై చరిత్ర సృష్టించాడు.

 Top 100 Indian Nri In Forbes List-TeluguStop.com

గల్ఫ్ అక్కడి వ్యాపార, వాణిజ్య రంగాల్లో సత్తా చాటిన వంద మందికిపైగా భారతీయుల జాబితాను ఫోర్బ్ప్‌ పత్రిక ‘టాప్‌ 100 ఇండియన్‌ లీడర్స్‌ ఇన్‌ ది అరబ్‌ వరల్డ్‌’ పేరుతో ప్రచురించింది.

అయితే వీరందరి ప్రస్తుత నికర ఆస్తుల విలువ 264 కోట్ల డాలర్లు…ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.17,952 కోట్లకు సమానం…అయితే ఇందులో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ)లో ఉండే యూసఫ్‌ ఆలీ ఎంఎ, బిఆర్‌ షెట్టి, రవి పిళ్లై అనే వ్యాపారవేత్తల ఆస్తుల విలువే 1,200 కోట్ల డాలర్లు.500 కోట్ల డాలర్ల ఆస్తులతో లూలు గ్రూప్‌ ఇంటర్నేషనల్‌ అధినేత యూసఫ్‌ ఆలీ ఎంఎ మొదటి స్థానంలో ఉన్నారు.

3.6 బిలియన్ డాలర్లతో బీఆర్ శెట్టి, 3.5 బిలియన్ డాలర్లతో రవి పిళ్లై వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.వీరందరూ దేశ విదేశాలలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తునే ఉన్నారు…వీరిలో కొందరు గల్ఫ్‌ దేశాల్లో చమురు నిక్షేపాలు బయట పడక ముందే అక్కడికి వచ్చి వ్యాపార, వాణిజ్యాలు ప్రారంభించారని.

అంచెలంచెలుగా ఎదుగుతూ గల్ఫ్ లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించారని ఫోర్బ్స్‌ తెలిపింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube