బాలీవుడ్ కి దీటుగా ఏజెంట్ పాత్రల్లో మెప్పించబోతున్న టాలీవుడ్ హీరోలు వీరే..!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మన వాళ్ళు తీస్తున్న సినిమాలు, వాటికి పెడుతున్న బడ్జెట్ కూడా బాలీవుడ్( Bollywood ) స్థాయిని మించి ఉంటుంది.

 Tollywood Heros In Agent Roles , Tollywood Heros, Tarak,  Adavi Seshu, Nikil  ,-TeluguStop.com

అందుకే బాలీవుడ్ తో ఇక ఏం పోటీ పెడతాం చెప్పండి.ఏదైనా పోటీ పడాలంటే అది హాలీవుడ్ తో అని అనుకున్నారో ఏమో అందరూ అదే తరహా సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.

మరి ముఖ్యంగా ఏజెంట్ పాత్రల్లో మెప్పించడానికి పలువురు టాలీవుడ్ హీరోలు రెడీ అయిపోయారు.ఇంతకీ ఏజెంట్ గా వస్తున్న మన తెలుగు సినిమా హీరోలు ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Adavi Seshu, Kamal Haasan, Nikil, Tarak, Tollywood, Tollywood Heros-Telug

వార్ 2 సినిమాలో కృతిక రోషన్ తో పాటు తారక్ ( Tarak )ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.బాలీవుడ్ లో నేరుగా తీస్తున్న తారక్ మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం.కేవలం తారక్ మాత్రమే కాదు గూడచారి 2 చిత్రంతో అడవి శేషు( Adavi seshu ) కూడా ఏజెంట్ పాత్రలో మెరవ బోతున్నాడు.ఇంతకు ముందు గూడచారి వన్ లోను అలాగే కొన్ని సినిమాల్లోనూ అతడు ఏజెంట్ పాత్రలో నటించాడు.

ది ఇండియ హౌస్ సినిమా ద్వారా నిఖిల్( Nikil ) కూడా మొట్ట మొదటిసారి ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాతో వస్తున్న విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నేనేమి తక్కువ తినలేదు అన్నట్టు తన నెక్స్ట్ లిస్టులో ఒక స్పై పాత్ర ఉండబోతుందట.

ఈ సినిమా ద్వారా అతడు మొట్టమొదటిసారి ఒక ఏజెంట్ రోల్ పోషించబోతున్నాడు.

Telugu Adavi Seshu, Kamal Haasan, Nikil, Tarak, Tollywood, Tollywood Heros-Telug

విక్రమ్ 2 లోను అలాగే సర్దార్ టూ లోను కార్తీ మరియు కమల్ హాసన్( Kamal Haasan ) ఏజెంట్ గా కనిపించబోతున్నారు.ఈ రెండు సినిమాల మొదటి భాగాల్లోనూ ఈ ఇద్దరు హీరోలు ఏజెంట్ పాత్రలోనే మెప్పించారు.ఇక మన వాళ్లు మాత్రమే కాదు నార్త్ లో కూడా చూసుకుంటే పటాన్ సినిమా సీక్వెల్ తో వస్తున్న షారుక్ ఖాన్ కూడా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఇక సిటాడెల్ సినిమాలో సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా ఏజెంట్ గా మెరువనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube