తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలకు కార్లు అంటే పిచ్చి అన్న విషయం మనందరికీ తెలిసిందే.కొందరు ఇప్పటికే కోట్లు విలువ చేసే కార్లు ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లను కొనుగోలు చేస్తూనే ఉంటారు.
వాటి ధర కోట్లలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.అయితే మరి మన టాలీవుడ్ హీరోలు ఎవరెవరు ఏ కారుని ఉపయోగిస్తున్నారు? వాటి ధర ఎంత అన్న వివరాల్లోకి వెళితే.టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వాడే రోల్స్ రాయల్ ఫాంటమ్ కారుని( Rolls Royce Phantom ) కొడుకు రామ్ చరణ్ బహుమతిగా ఇచ్చాడు.అప్పట్లో చిరంజీవి పుట్టిన రోజుకు ఇది గిఫ్ట్ ఇచ్చాడు.దీని విలువ రూ.3 కోట్లు.
అలాగే డార్లింగ్ ప్రభాస్( Prabhas ) కూడా రోల్స్ రాయస్ ఫాంటమ్ కార్ ని ఉపయోగిస్తున్నారు.ఆ కారుధర అక్షరాలా రూ.8 కోట్లు. అలాగే మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం V8 వింటేజ్ కార్ ఉన్నా కూడా ఇటీవల మూడున్నర కోట్లు పెట్టి రేంజ్ రోవర్ తీసుకున్నాడు.
అలాగే అక్కినేని హీరో అఖిల్( Akhil ) ప్రస్తుతం బెంజ్ G63 కార్( Benz G63 Car ) వాడుతున్నాడు.ఆ కారు ధర రెండున్నర కోట్లు.
సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఇటీవల తన భార్య నమ్రత పుట్టినరోజు సందర్భంగా రెండు కోట్లు ఆ విలువ చేసే రేంజ్ రోవర్ కారుని( Range Rover ) గిఫ్ట్ గా ఇచ్చారు.

నాగార్జున ( Nagarjuna )కూడా కోటిన్నర విలువ చేసే బీఎండబ్ల్యూ M6 కారు వాడుతున్నారు.అక్కినేని నాగచైతన్య కూడా కోట్లు విలువ చేసే నిసాన్, ఫెరీరా, బిఎమ్‌డబ్ల్యూ కార్లు ఉపయోగిస్తున్నారు.టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ( Balakrishna ) కూడా కోటిన్నర పెట్టి BMW 7 కార్ తీసుకున్నారు.
మాస్ మహారాజ రవితేజ( Raviteja ) కోటిన్నర విలువచేసే మెర్సడెస్ క్లాస్ కారుని ఉపయోగిస్తున్నారు.ఎన్టీఆర్ పోర్షే కార్ తీసుకున్నాడు.ఈయనతో మరో రెండు కార్స్ కూడా ఉన్నాయి.వాటి విలువ రెండు కోట్లకు పైగానే ఉంటుంది.

ఎన్టీఆర్ దగ్గర ఉన్న కార్ల కలెక్షన్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అదేవిధంగా అల్లు అర్జున్( Allu Arjun ) కూడా రెండు కోట్లకు పైగానే ఉన్న జాగ్వార్ కార్ వాడుతున్నాడు.అలాగే ఈయన వ్యానిటీ వ్యాన్ ఖరీదు కూడా అక్షరాలా రూ.6 కోట్లకు పైగానే ఉంది.టాలీవుడ్‌లో మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ వ్యానిటీ వ్యాన్ ఇదే.అయితే వీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్లతో పాటు ఇంకా మరింత విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి.