వావ్: శభాష్ చాను.. 150 మంది ట్రక్ డ్రైవర్స్ ను ఇంటికి పిలిచి మరి సత్కారం.. ఎందుకంటే..??

మనం ఏదన్నా విజయం సాదించమంటే ఆ విజయానికి కారణం నేనే అని అనుకోవడం పొరపాటు.మన వెనుక వుండి మనల్ని విజయం వైపు నడిపించిన వారు చాలామందే ఉంటారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి.

 Tokyo Olympics Medalist Meerabai Chanu Invited 150 Truck Drivers To Her Home , I-TeluguStop.com

కానీ ఈ కాలంలో ఎవరి స్వార్ధం వారిది.వాళ్ళు గొప్ప స్థాయిలోకి వెళ్ళగానే, కష్టాల్లో తమకు అండగా నిలిచిన వ్యక్తులను మరిచిపోతారు.

కానీ మన మీరాబాయి చాను మాత్రం అలా కాదు.తన విజయానికి కారణం అయిన వారిని ఇంటికి పిలిచి మరి సత్కరించింది.

ఇప్పుడు ప్రతి భారతీయుడు చాను పేరు వింటే పులకరించిపోతారు.ఎందుకంటే 2020 టోక్యో ఒలింపిక్స్ లో దేశానికి తొలిపతకం అందించిన మహిళ మీరాబాయి చాను.

ఒలంపిక్స్ లో గెలిచినా తరువాత స్వస్థలంకు తిరిగొచ్చిన చానును కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు వస్తున్నారు.అయితే చాను ఇంతటి విజయాన్ని సాధించడానికి ముఖ్య కారణం అయిన పలువురు ట్రక్ డ్రైవర్స్ ను ఇంటికి పిలిచి మరి వారికి కృతజ్ఞతలు తెలిపింది.

అసలు వివరాల్లోకి వెళితే.

మీరాబాయి చాను మణిపూర్ లోని నాంగ్‌ పాక్ కాచింగ్ గ్రామంలో జన్మించినది.

అయితే చాను చిన్న వయసులోనే తాను ఉంటున్న ఊరిలో వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేదట.

Telugu Truck Drivers, Meerabai Chanu, Mirabai Chanu, Netizens, Tokyoolym, Latest

ఆ తర్వాత ఇంపాల్ అనే ఉరికి వెళ్ళేదట.కానీ ఆ ఊరు చాను నివసించే గ్రామానికి 30 కి.మీ.దూరంలో ఉండేది.

అక్కడ రవాణా సౌకర్యం అంతంత మాత్రంగానే ఉండేదట.

ఆ సమయంలో శిక్షణకు వెళ్లే సమయంలో ఆ ఊరిలో తిరిగే ఇసుక ట్రక్ డ్రైవర్స్ ను లిఫ్ట్ అడిగేదట.అలా ప్రతిరోజు ట్రక్కులలో వెళ్లి శిక్షణ తీసుకునేది.

ఆ ట్రక్ డ్రైవర్స్ సహాయం చేయకపోతే ఆమె కోచింగ్ తీసుకునేది కాదు.ఈనాడు ఒలంపిక్స్ లో విజేతగా కూడా నిలిచేది కాదు.

Telugu Truck Drivers, Meerabai Chanu, Mirabai Chanu, Netizens, Tokyoolym, Latest

అలా తన అకాడమీకి వెళ్లేందుకు లిఫ్ట్ ఇచ్చి తనకు సహకరించిన 150 మంది ట్రక్కు డ్రైవర్లను తన ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టి వాళ్ళ రుణం తీర్చుకుంది.అలాగే వచ్చిన వారికి ఒక షర్ట్‌, మణిపురి కండువాను గిఫ్ట్ గా ఇచ్చి వాళ్ళని సత్కరించింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ విషయం తెలిసి చాను పై అందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఇకపోతే చాను మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టింది.రాబోయే ఏడాది జరిగే ఆసియా గేమ్స్‌, అలాగే 2024 లో జరిగే ఒలింపిక్స్‌ కోసం ఇప్పటినుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube