రాత్రిపూట రోడ్డుపై స్నానం ఆచరించిన నటుడు.. కారణమేంటంటే..?

నటుడిగా, మోడల్ గా, నిర్మాతగా, ఫిట్ నెస్ ఫ్రీక్ గా మిలింద్ సోమన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.55 సంవత్సరాల వయస్సులో కూడా యాక్టివ్ గా కనిపించే మిలింద్ సోమన్ సోషల్ మీడియాలో తన ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అప్పుడప్పుడూ మిలింద్ సోమన్ ఫన్నీ వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు.

 Actor Milind Soman Taking Bathing Post Goes Viral In Social Media, Milind Soman,-TeluguStop.com

తాజాగా మిలింద్ సోమన్ ఒక ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ నటుడు రోడ్డుపై కూర్చుని బకెట్ నిండా నీళ్లు నింపుకుని ఆ నీళ్లతో స్నానం చేశారు.రాత్రిపూట మిలింద్ సోమన్ స్నానం చేయడంతో ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు.

అయితే మిలింద్ సోమన్ ఈ విధంగా స్నానం చేయడానికి ముఖ్యమైన కారణం ఉందని సమాచారం.

సినిమా షూటింగ్ కొరకు మిలింద్ సోమన్ ఈ విధంగా స్నానం చేశారు.

క్యాప్షన్ లో ఒకవైపు వర్షం పడుతుండగా మరోవైపు వేడినీళ్లతో స్నానం చేశానని ఈ నటుడు చెప్పుకొచ్చారు.చాలామంది తనను పుషప్స్, రన్నింగ్ కాకుండా ఏమైనా చేస్తావా అని అడుగుతున్నారని అలా అడిగే వాళ్లకు ఇదే తన సమాధానమని మిలింద్ సోమన్ తెలిపారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా వీడియో పోస్ట్ కు 32,000కు పైగా లైక్స్ వచ్చాయి.

బాజీరావ్ మస్తానీ, టర్కీబ్ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలతో మిలింద్ సోమన్ గుర్తింపును సంపాదించుకున్నారు.బాలీవుడ్ సినిమాలతో పాటు పలు సౌత్ ఇండియా సినిమాలలో కూడా మిలింద్ సోమన్ నటించడం గమనార్హం.మిలింద్ సోమన్ పోస్ట్ కు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube