ఫేక్ ఈ-మెయిల్ పై తిరుమల పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది.ఫేక్ ఈ-మెయిల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
మరొకరి మెయిల్ ఐడీని హ్యాక్ చేసి మెయిల్ పంపినట్లు నిర్ధారించారు.ఈ క్రమంలోనే పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులతో సంప్రదింపులు చేస్తున్నారు.
మరోవైపు తిరుమలలో అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.భక్తులు ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా శ్రీవారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు.