తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ( CM KCR )మహారాష్ట్రపై ఏ స్థాయిలో గురి పెట్టారో చూస్తూనే ఉన్నాం.జాతీయ రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేసిన తరువాత మహారాష్ట్రపైనే ఎక్కువగా దృష్టి పెట్టారాయన.
అక్కడ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూ.వివిద పార్టీలలోని నేతలను బిఆర్‌ఎస్ లోకి ఆహ్వానిస్తూ మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు.
అయితే కేసిఆర్ ఈ రేంజ్ లో మహారాష్ట్ర పై దృష్టి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు.ప్రస్తుతం మహారాష్ట్రలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం ఏర్పడింది.
అక్కడి బలమైన పార్టీలు అయిన శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలలో తీవ్రమైన అనిశ్చితి ఏర్పడింది.

దాంతో అక్కడి ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని బిఆర్‌ఎస్ ను బలపరిచేందుకు కేసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి.ఇతర పార్టీలలోని కీలక నేతలంతా బిఆర్‌ఎస్ వైపు చూస్తున్నారు.
దీంతో రాబోయే రోజుల్లో బిఆర్‌ఎస్ మహారాష్ట్రలో కూడా శక్తివంతమైన పార్టీగా రూపుదిద్దుకోవడానికి ఎంతో సమయం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.అయితే మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ ఒంటరిగానే బలపడుతుందా లేదా ఇతర ఏ పార్టీతోనైనా పొత్తు కలుపుకుంటుందా అనే ప్రశ్న పోలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది.

ఎందుకంటే అమద్య శివసేన పార్టీ నేత ఉద్దవ్ థాక్రే కేసిఆర్ తో భేటీ అయిన( Uddhav Thackeray ) సంగతి తెలిసిందే.దీంతో థాక్రే వర్గంతో కేసిఆర్ కలవబోతున్నారా అనే చర్చ జోరుగా జరిగింది.అయితే మహారాష్ట్ర( Maharashtra )లో పొత్తులపై కేసిఆర్ తాజాగా స్పష్టత ఇచ్చారు.ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని కేసిఆర్ క్లారిటీ ఇచ్చారు.

దీంతో కేసిఆర్ ఒంటరి పోరు మహారాష్ట్రలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే చర్చ తెరపైకి వస్తోంది.అయితే ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ కు లభిస్తున్న ఆధారణ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్ క్రియాశీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఒకవేళ బిఆర్‌ఎస్ బలపడితే శివసేన, బిజెపి వంటి పార్టీలకు పెను ముప్పే అనేది విశ్లేషకులు చెబుతున్నా మాట.మరి ఏం జరుగుతుందో చూడాలి.