Chaitanya Master: చైతన్య మాస్టర్ మృతి కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. బెదిరింపుల వల్లే చనిపోయాడంటూ?

తాజాగా తెలుగు బుల్లితెరపై విషాదం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే. ఢీ షో ( Dhee Show ) ఫేమ్ డాన్స్ మాస్టర్ చైతన్య( Chaitanya Master ) ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Shocking Twist In Dhee Choreographer Chaitanya Master Case-TeluguStop.com

ప్రస్తుతం ఇదే వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా వినిపిస్తోంది.అయితే చైతన్య మాస్టర్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేసులో భాగంగా మరో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.అదేమిటంటే చైతన్య ఆత్మహత్యకు బెదిరింపులే కారణం అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

అప్పు ఇచ్చిన వారు చైతన్య మాస్టర్ ను బెదిరించడంతో ఇలాంటి దారుణమైన నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దాంతో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.

ఇక ఇందులో భాగంగానే చైతన్య ఫోన్‌ను ఇప్పటికే స్వాధీనంలోకి తీసుకున్నారు.అతడి కాల్‌ డేటాను( Call Data ) వారు పరీక్షించే అవకాశం ఉంది.

ఇక చైతన్య మరణం పై ఆయన మిత్రుడు ఒకరు మాట్లాడుతూ చైతన్య మాస్టర్‌ లైఫ్‌ గురించి చాలా చెప్పేవాడని, తోటి డ్యాన్సర్‌లను ఎప్పుడూ మోటివేట్‌ చేస్తూ ఉండేవారని చెప్పుకొచ్చారు.చైతన్య మరణానికి ఆర్థిక సమస్యలు కారణం కాదని స్పష్టం చేయడంతో, బెదిరింపుల ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది.

Telugu Chaitanyamaster, Dhee Show, Nellore-Movie

కాగా, చైతన్య మాస్టర్‌ శనివారం నెల్లూరు జిల్లాలో తనకోసం ఏర్పాటు చేసిన సన్మాన సభకు హాజరయ్యారు.సన్మానం అనంతరం బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు.ఆదివారం సాయంత్రం హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఆత్మహత్యకు ముందు ఒక సెల్ఫీ వీడియోని కూడా తీశారు.తాను చనిపోవటానికి అప్పులే ప్రధాన కారణమని తెలిపారు.ఇక, చైతన్య మాస్టర్‌ చెల్లెలి పెళ్లి కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేశారు.

కుటుంబం కోసం కూడా కొన్ని అప్పులు చేశారు.తన కెరీర్‌ కోసం.

డ్యాన్స్‌ స్టూడియో ఏర్పాటు కోసం కూడా అప్పు చేశారు.

Telugu Chaitanyamaster, Dhee Show, Nellore-Movie

వచ్చే సంపాదన అప్పులు తీర్చడానికి సరిపోయేది కాదు.దీంతో ఆ అప్పులు తీర్చడానికి మరో చోట అప్పులు చేశారు.ఇలా అప్పుల మీద అప్పులు చేయటం.

వాటి వడ్డీలు పెరిగి పోవటం మొదలైంది.చాలీ చాలని సంపాదనతో ఆ అప్పుల్ని తీర్చటం ఆయన వల్ల కాలేదు.

అప్పులు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి మొదలవ్వగా ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.దాంతో ఎవరు ఊహించని విధంగా ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube