టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Ravi teja ) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు.( Tiger nageswara rao movie ) అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే కొన్ని సినిమాల వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు చుట్టుముడుతున్నాయి.
అంతేకాకుండా ఈ సినిమాను వెంటనే ఆపేయాలని విడుదల చేయడానికి వీల్లేదు అంటూ నిరసనలు కూడా చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే స్టువర్టుపురం గ్రామస్థులు నిరసనదీక్షకు దిగారు.
తమ జాతిని, తమ గ్రామాన్ని కించపరిచే విధంగా టైగర్ నాగేశ్వరావు సినిమాను రూపొందిస్తున్నారంటూ స్టువర్టుపురం గ్రామస్థులు( Stuartpuram ) ఆరోపిస్తున్నారు.

ఎరుకల జాతికి చెందిన టైగర్ నాగేశ్వరావును గజదొంగలాగా చూపించడంతో పాటు, స్టువర్టుపురంలో ఉన్న అందరూ దొంగలు అనే విధంగా సినిమా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.టైగర్ నాగేశ్వరరావు సినిమాను ఆపాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టువర్టుపురం గ్రామస్థులు పిటిషన్ దాఖలు చేశారు.ఎరుకలను కించపరిచేలా టీజర్‌లో డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని ప్రజా ప్రయోజన వాజ్యంలో పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టు కూడా సీరియస్ అయ్యింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అనుమతి లేకుండా టీజర్‌ను ఎలా రిలీజ్ చేశారని నిర్మాణ సంస్థ అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) ఆర్ట్స్‌ను ప్రశ్నించింది.
ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ధర్మాసనం సూచించింది.

తాజాగా విజయవాడలోని ధర్నా చౌక్( Dharna Chowk ) వద్ద ఎరుకలు నిరసన దీక్షలు చేపట్టారు.అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ సినిమాను వెంటనే ఆపేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.
స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశ నేర రాజధానిగా చూపించడం ఏంటని ప్రశ్నించారు.ఈ సినిమాల కారణంగా తమ గ్రామంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సినిమాను తెరకెక్కించే ముందు నిర్మాతలు కానీ, దర్శకుడు కానీ తమను సంప్రదించలేదని వారు ఒపించారు.ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎరుకలను అవమానిస్తూ సినిమా తీస్తున్న నిర్మాతపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.ఈ వివాదాలు అన్ని దాటుకొని టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల అవుతుందా లేదంటే ఆగిపోతుందా అన్నది చూడాలి మరి.