ప్రకాశం జిల్లా అర్దవీడు మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.మండలంలోని మాగుటూరు, గొట్టిపాడియా, లక్ష్మీపురంతో పాటు నాగులవరంలో పులి సంచరిస్తుందని స్థానికులు చెబుతున్నారు.
సమీప గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను సేకరించారు.అయితే పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.