న్యూయార్క్‌ నగరాన్ని సముద్రం మింగేస్తోందా?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరం ఏది అని ఎవరినైనా అడిగితే, ఠక్కున న్యూయార్క్‌ నగరం( New York City ) పేరు చెబుతారు.అన్ని విశేషతలు కలిగిన నగరం మరి.

 Is The Ocean Swallowing New York City, Is The Ocean, Latest News, Telugu Nri Lat-TeluguStop.com

ఎత్తయిన ఆకాశ హర్మాయాలకు పెట్టింది పేరు న్యూయార్క్‌.కాంక్రీటు జంగల్‌గా మారిన ఈ ఖరీదైన నగరం త్వరలో సముద్ర గర్భంలో మునిగిపోతుందని జియాలజిస్టులు జోష్యం చెబుతున్నారు.

భారీ నిర్మాణాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆ నగరాన్ని ఇప్పుడు అవే ముంచబోతున్నాయని టాక్ వినబడుతోంది.

ఏటా 2 మిల్లీ మీటర్లు( 2 mm ) మేర కుంగిపోతోందని తాజా నివేదికలు చెబుతున్నాయి.ఇదేగాని కొనసాగితే రానున్న రోజుల్లో నగరం పూర్తిగా సముద్రంలో మునిగిపోవడం ఖాయమని అంటున్నారు నిపుణులు.సముద్రం పక్కనే ఉన్న భవనాలు ముందుగా మునిగిపోతాయని, ఈ విషయమై జనాలు అప్రమత్తంతో ఉండాలని నివేదికలో పేర్కొన్నారు.

ఈ నివేదిక న్యూయార్క్‌ వాసులను భయబ్రాంతులకు గురి చేస్తోంది.

అవును, న్యూయార్క్‌ నగరంలో భూమి అధిక బరువుతో తల్లడిల్లుతోంది.దీంతో భూమి పొరల్లో అనేక మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి.ఫలితంగా ఏడాదికి 2 మిల్లీ మీటర్ల చొప్పున కుంగిపోతోంది.

శాటిలైట్‌ చిత్రాల్ని( Satellite images ) పోల్చి చూసినప్పుడు ఈ తేడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.దిగువన ఉండే మాన్‌హాటన్‌∙వంటి ప్రాంతాలు చాలా త్వరగా క్షీణిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.న్యూయార్క్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ ప్రకారం, న్యూయార్క్‌లోని 10 లక్షల భవనాల బరువు 1.7 ట్రిలియన్‌ పౌండ్లు.యూనివర్స్శిటీ ఆఫ్‌ రోడ్‌ ఐలాండ్‌లోని యుఎస్‌ జియోలాజికల్‌ సర్వే, జియాలజిస్టులు కలిసి.ఈ లెక్కలు వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube