టెక్ దిగ్గజం ఆపిల్( Apple ) ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్‌ల కోసం కొత్త ఐఓయస్ 16.5 అప్‌డేట్‌ను తాజాగా తీసుకు వచ్చింది.ఈ కొత్త సిస్టమ్ అప్‌డేట్ ఐఫోన్ 8, ఆ తరువాత వచ్చిన ఐఫోన్ వెర్షన్లలో మాత్రమే అందుబాటులో కలదు.ఈ కొత్త ఐఓయస్ అప్‌డేట్ ద్వారా కొన్ని బగ్‌లను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ఆపిల్ ఐపాడ్, వాచెస్, మాక్స్, టీవీల కోసం కొత్త అప్‌డేట్‌లను కూడా రిలీజ్ చేస్తూ వస్తోన్న విషయం అందరికీ తెలిసినదే.అయితే ఈ కొత్త అప్‌డేట్స్ వచ్చే జూన్‌లో రాబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇకపోతే, దేశంలో ఆఫిల్ న్యూస్ అందుబాటులో లేనందున, భారత్‌లో వున్న ఐఫోన్ యూజర్లు ఈ కొత్త అప్‌డేట్ గురించి వేచి చూడాల్సిన అవసరం లేదని చెప్పాలి.ఐఓఎస్ (IOS 16.5) స్పాట్‌లైట్‌తో ఇతర బగ్ సమస్యలను కూడా పరిష్కరిస్తున్నట్టు భోగట్టా.కొంతమంది ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించలేరు.
ఆపిల్ కార్ ప్లే, స్క్రీన్ టైమ్ టూల్‌కి సంబంధించిన ఇతర సమస్యలు కూడా ఈ అప్‌డేట్‌తో ఫిక్స్ చేసింది.
ఆపిల్ కొత్త ఐఓయస్ అప్‌డేట్( New iOS Update )ను రిలీజ్ చేయగానే, ఐఫోన్ యూజర్లు సెట్టింగ్స్, జనరల్, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కు వెళ్లడం ద్వారా అప్డేట్ చేయవచ్చు.ఐప్యాడ్‌లు, మ్యాక్‌లలో అప్‌డేట్‌లను చెక్ చేసేందుకు అదే ప్రాసెస్ ఉంటుంది.అదే సమయంలో, ఆపిల్ జూన్ 5న జరగబోయే WWDC 2023లో ఐపాడ్ ఓయస్17, ఓయస్17లను ఆవిష్కరించడానికి రెడీ అవుతోంది.
అదే ఈవెంట్‌లో, మొదటి AR/VR లేదా మిక్స్‌డ్-రియాలిటీ హెడ్‌సెట్, డెడికేటెడ్ ఓయస్ ని ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు.