అధికార పార్టీ అంటేనే పదవుల భర్తీ నిత్యం జరుగుతూనే ఉంటుంది.ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్లు రాని వారంతా కూడా ఎమ్మెల్సీ సీట్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు.
పైగా ఇతర పార్టీల నుంచి వచ్చే వారు కూడా ఈ పదవులనే ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు.ఇక అధికార పార్టీ కూడా వారికి ఈ ఎమ్మెల్సీలను ఎక్కువగా ఆఫర్ చేసి బుజ్జగిస్తుంది.
అయితే ఇచ్చిన మాట ప్రకారం పదవి ఇవ్వకపోతే ఆ మనోవేదన అంతా ఇంతా కాదు.ఎందుకంటే కచ్చితంగా వస్తుందనే మాట ఇచ్చినంతనే వారు గంపెడు ఆశలు పెట్టుకుంటారు.
ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ ఎస్‌లో కూడా ఇలాగే చాలామంది ఎమ్మెల్యే కోటాలో, స్థానిక సంస్థల కోటాలో పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు.తీరా చూస్తే చాలామందికి కేసీఆర్ మొండి చేయి చూపడంతో వారంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు.
ఎమ్మెల్యే కోటాలో డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ తో పాటుగా బోడకుంటి వెంకటేశ్వర్లు, అలాగే లలిత, ఫరీదుద్దీన్ తమకు మళ్లీ ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు.కానీ అవకాశం దక్కలేదు.
ఇతర బడా నేతల కారణంగా వీరికి అవకాశం రాలేదు.

ఇకపోతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఐదుగురు ఇలాగే ఆశలు పెట్టుకుని చివరకు నిరాశ పడ్డారు.వారికి ఇలాంటి పదవి దక్కకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు.తేరా చిన్నపరెడ్డి, లక్ష్మీనారాయణ, భూపాల్ రెడ్డి, లక్ష్మణరావు పురాణం సతీశ్ లు మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నారు.
వీరంతా కూడా తమకే అసలు వస్తాయని ఆశతో ఉంటే చివరకు నిరాశే మిగిలింది.రాజకీయ సమీకరణాల దృష్ట్యా వీరికి పదవులు ఇవ్వలేకపోయామని కేసీఆర్ వారికి భవిష్యత్ మీద మాత్రం హామీలు ఇచ్చారంట.
మరి ఇప్పుడే తమకు అవకాశం ఇవ్వకపోవడంతో భవిష్యత్ లో పదవులు ఇస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి వారి అనుచర వర్గంలో.