కపిల్ దేవ్‌ను క్రికెటర్లు తమ స్ఫూర్తిదాయకునిగా భావించడానికి కారణం ఇదే...

భారత క్రికెట్ జట్టుకు తొలి ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 1959 జనవరి 6న చండీగఢ్‌లో జన్మించాడు.ఫాస్ట్ బౌలింగ్‌లో భారత్‌కు ఘనమైన పేరు తెచ్చిన కపిల్ దేవ్.

 This Is The Reason Why Cricketers Consider Kapil Dev As Their Inspiration , Cric-TeluguStop.com

హర్యానా హరికేన్‌ అనే పేరు కూడా సంపాదించాడు.ప్రపంచంలో విజయవంతమైన ఆల్ రౌండర్లలో ఒకరిగా కపిల్ నిలిచాడు.

కపిల్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు సృష్టించాడు.ఇంతేకాకుండా కపిల్ కెప్టెన్సీలో భారత జట్టు 1983లో తొలిసారి ప్రపంచ కప్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

ప్రతి క్రికెటర్ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ మాదిరిగా తయారు కావాలని కోరుకుంటాడు.కపిల్ దేవ్ ప్రస్తుతానికి క్రికెట్ ప్రపంచానికి దూరంగా ఉండవచ్చు.

కానీ నేటికీ అతనినే ఉదాహరణగా చెబుతుంటారు.

కపిల్ తన బ్యాటింగ్, బౌలింగ్‌తో మైదానంలో అద్భుతాలు చేశాడు.

కపిల్ దేవ్‌కు 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, కుటుంబ సభ్యులు అతనిని ముంబైలోని శిక్షణా శిబిరానికి పంపారు.మొదటి రోజు కపిల్‌కు తినేందుకు రెండు రోటీలు, ఒక కూర ఇచ్చారు.

ఇది చూసిన కపిల్ ఆ ఆహారం తినడానికి నిరాకరించాడు.అనంతరం కపిల్ క్యాంపు మేనేజర్ తారాపూర్ దగ్గరకు వెళ్లాడు.

‘సార్.నేను ఫాస్ట్ బౌలర్‌ని.

రెండు రొట్టెలు నాకు సరిపోవని’ చెప్పాడు.దీంతో తారాపూర్ మాట్లాడుతూ నీకు అధికంగా రోటీలు కావాలంటే రాబోయే 40 ఏళ్లలో భారతదేశంలో నీ అంతటి ఫాస్ట్ బౌలర్ పుట్టలేదనేలా నిరూపించుకో’ అని అన్నారు.

ఇది విన్న వెంటనే కపిల్ తాను భారత ఫాస్టెస్ట్ బౌలర్ కావాలని నిర్ణయించుకున్నాడు.

Telugu Cricket Cup, Cricketers, Kapil Dev-Latest News - Telugu

కపిల్ దేవ్ కెరీర్కపిల్ దేవ్ తన 16 ఏళ్ల కెరీర్‌లో 134 టెస్టు మ్యాచ్‌ల్లో 434 వికెట్లు పడగొట్టాడు.8 సెంచరీలు చేశాడు.5248 పరుగులు చేయడంతోపాటు 400 వికెట్లు తీసి, 5000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.ఇంతేకాకుండా కపిల్ తన టెస్ట్ కెరీర్‌లో కేవలం 20 సార్లు మాత్రమే నో బాల్స్ బౌలింగ్ చేశాడు.కపిల్ దేవ్ వేగంగా పరిగెత్తడంలో పేరొందాడు.అతను ఆడిన 184 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఎప్పుడూ రనౌట్ కాలేదు.భారత్ తరఫున కపిల్ దేవ్ మొత్తం 225 వన్డేలు ఆడాడు.27.45 సగటుతో 253 వికెట్లు పడగొట్టడంతోపాటు బ్యాటింగ్‌లో కపిల్ 95.07 స్ట్రైక్ రేట్‌తో 3783 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్‌లో 200 వికెట్లు తీసిన తొలి ఆటగాడుగా కపిల్ దేవ్ మరో ఘనత సాధించాడు.

ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న సమయంలో కపిల్ దేవ్ వయస్సు కేవలం 24 సంవత్సరాలే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube