2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.టిడిపి, బిజెపి, జనసేన కూటమి నుంచి నరసాపురం నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని రఘురామ భావించారు.
దీనికి తగ్గట్లుగానే మూడు పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ, జగన్ ను ఇరుకను పెట్టడమే లక్ష్యంగా ఉంటూ వచ్చారు.అయితే తాజాగా ప్రకటించిన బిజెపి అభ్యర్థుల జాబితాలో నరసాపురం నుంచి రఘురాం కృష్ణంరాజు పేరు లేదు.
పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బిజెపి( BJP ) తీసుకుంది.ఆ టికెట్ తనకు ఇస్తే బిజెపిలో చేరాలని రఘురామ భావించారు.
కానీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి నేత శ్రీనివాస్ వర్మను ప్రకటించారు.దీంతో రఘురామ కు చుక్కెదురయింది.
తనకు సీట్ దక్కకపోవడం వెనుక జగన్ కుట్ర ఉందని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.సార్వత్రిక ఎన్నికలలో తాను కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.
తాజా పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు పంపుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని, తాను ఎలాంటి ఆందోళన లో లేనని, అలాగని సంతోషంగా కూడా లేనని అన్నారు.