JAGAN: చూస్కో జగన్  కాస్కో జగన్ .. పెద్ద వార్నింగే ఇది 

2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు( Raghurama Krishna Raju ) ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు.

టిడిపి, బిజెపి, జనసేన కూటమి నుంచి నరసాపురం నుంచి మళ్లీ ఎంపీగా పోటీ చేయాలని రఘురామ భావించారు.

దీనికి తగ్గట్లుగానే మూడు పార్టీలతో సన్నిహితంగా మెలుగుతూ, జగన్ ను ఇరుకను పెట్టడమే లక్ష్యంగా ఉంటూ వచ్చారు.

అయితే తాజాగా ప్రకటించిన బిజెపి అభ్యర్థుల జాబితాలో నరసాపురం నుంచి రఘురాం కృష్ణంరాజు పేరు లేదు.

పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బిజెపి( BJP ) తీసుకుంది.ఆ టికెట్ తనకు ఇస్తే బిజెపిలో చేరాలని రఘురామ భావించారు.

కానీ నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి నేత శ్రీనివాస్ వర్మను ప్రకటించారు.దీంతో రఘురామ కు చుక్కెదురయింది.

తనకు సీట్ దక్కకపోవడం వెనుక జగన్ కుట్ర ఉందని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సార్వత్రిక ఎన్నికలలో తాను కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని రఘురామ కృష్ణంరాజు క్లారిటీ ఇచ్చారు.

తాజా పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ సందేశాలు పంపుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని, తాను ఎలాంటి ఆందోళన లో లేనని, అలాగని సంతోషంగా కూడా లేనని అన్నారు.

"""/" / Style="height: 10px;overflow: Hidden" తనకు జగన్( Jagan ) మార్క్ షాక్ ఇవ్వబోతున్నారని, టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని, పిల్ల సజ్జల వెబ్ సైట్లు, మీడియా ఛానల్స్ ముందే చెప్పాయని రఘురాము పేర్కొన్నారు.

ఇప్పటి వరకు జగన్ తనను డిస్క్ క్వాలిఫై చేయాలని , ఒక దశలో చంపేయాలని కూడా ప్రయత్నాలు చేశారని రఘురామ వ్యాఖ్యానించారు.

తనను అరెస్టు చేయించి జైల్లో పెట్టి చంపేందుకు జగన్ చేసిన కుట్రలు అయ్యాయని జగన్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని, తాను అపజయాన్ని అంగీకరిస్తున్నానని అన్నారు.

</br """/" / సోము వీర్రాజు( Somu Veerraju ) ద్వారా తనకు టికెట్ దక్కకుండా జగన్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారని, కానీ జగన్ అనుకున్నది మాత్రం తాను జరగనివ్వనని శపధం చేశారు.

పార్టీలు అన్యాయం చేసినా, ప్రజలు తనకు అన్యాయం చేయరనే విశ్వాసం ఉందని, మరో మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తాను చూసుకో జగన్.

కాస్కో జగన్ అంటూ సవాల్ విసిరారు.

ఆంధ్రావాలా మూవీని తలదన్నేలా బాలయ్య మూవీ ఈవెంట్.. అన్ని లక్షల మంది వస్తారా?