ప్ర‌భుత్వ ఉద్యోగిపై థ‌ర్డ్ డిగ్రీ.. దొంగ అనుకుని చేశామ‌న్న పోలీసులు..!

పోలీసుల దెబ్బలు మామూలుగా ఉండవు.వారి చేతిలో తన్నులు తిన్నవారికి ఎప్పటికైనా భవిష్యత్ లో ఆ నొప్పులు లేస్తూనే ఉంటాయి.

 Third Degree On Government Employee .. Police Pretended To Be A Thief  Police, W-TeluguStop.com

కానీ కొంత మంది అనవసరంగా తప్పులు చేస్త పోలీసులకు దొరికిపోతారు.కానీ కొంత మంది ఎటువంటి తప్పు చేయకపోయినప్పటికీ పోలీసుల చేతిలో అనవసరంగా దెబ్బలు తింటారు.

అలాంటి ఘటనే ప్రస్తుతం ముంబైలో జరిగింది.ఏకంగా ఓ ప్రభుత్వ ఉద్యోగినే దొంగగా భావించిన పోలీసులు చితక బాదారు.

తాము చేసిన మిస్టేక్ తెలిసిన తర్వాత యథావిధిగా అతడిని వదిలేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.కానీ తామొకటి తలిస్తే ఆ దైవం మరొకటి తలిచినట్లు సైలెంట్ గా ఉండి ఈ ఘటనను ఎవరితో చెప్పడని భావించిన పోలీసులకు ఆ ఉద్యోగి షాకిచ్చాడు.

ఈ ఘటనను అందరితో చెబుతూ ఇది అన్యాయం అంటూ వాపోయాడు.ఏ తప్పు చేయని ప్రభుత్వ ఉద్యోగిని చితకబాదిన పోలీసులను సస్పెండ్ చేయాలని పోర్టు ఉద్యోగులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు.

మంబై మహానగరంలోని భయన్దార్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్న పోలీసులు దొంగ అనుకుని పొరపాటున జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ లో పనిచేసే అగస్టిన్ ను బంధించారు.అలా బంధించడంతో అగస్టిన్ తాను దొంగను కాదని ప్రభుత్వ ఉద్యోగినని ఎంతగానో చెప్పాడు.

కానీ పోలీసులు అతడి మాటను వినిపించుకోలేదు.సరికదా అతడిని దొంగ అని ఒప్పుకోమంటూ బెదిరించారు.

కానీ అగస్టిన్ అందుకు ససేమిరా అనడంతో ఇక థర్డ్ డిగ్రీని ప్రయోగించారు.అసలు విషయం లేటుగా తెలుసుకున్న పోలీసులు అగస్టిన్ ను విడిచిపెట్టారు.

దీనిపై అగస్టిన్ న్యాయ పోరాటానికి దిగడంతో అగస్టిన్ ను చితకబాదిన పోలీసులు అరెస్టయ్యారు.అగస్టిన్ ను కొట్టిన ముగ్గురు పోలీసులను అరెస్టు చేసి కస్టడీకి పంపినట్లు సీనియర్ పోలీసు అధికారి ముగుత్రావ్ పాటిల్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube