ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న మంచిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు.నంద్యాల పర్యటనలో భాగంగా ఆయన ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నిధులను పంపిణీ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా సాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు.అనంతరం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు.

 Think And Take A Decision. Cm Jagan's Key Comments-TeluguStop.com

అప్పుడు, ఇప్పుడూ ఒకే బడ్జెట్ అన్న సీఎం జగన్.వాళ్లు చెప్పేది నమ్మొద్దని తెలిపారు.

అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు.అప్పుల పెరుగుదల అప్పటికంటే ఇప్పుడు తక్కువేనని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా జరుగుతున్న మంచిని చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube