కీర్తి సురేష్.ఈమె తన సహజమైన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది ఈ మహానటి.
ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన ఈమె నటనకు పెద్దగా పేరు రాలేదు.కానీ కీర్తి సురేష్ మహానటి సినిమా చేసిన తర్వాత మాత్రం ఈమెను తెరమీద ఎవ్వరు చూడలేదు.
మహానటి సావిత్రి గారినే ఉహించు కున్నారు.ఈ సినిమాతో జాతీయ పురస్కారం అందుకుని జాతీయ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.
స్టార్ హీరోయిన్ అయినా ఇటీవల ఈమె చేస్తున్న సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అవుతూ వస్తున్నాయి.అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాట ఈమెను ఆదుకుంది అనే చెప్పాలి.
ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు కీర్తి సురేష్ మునుపటి కంటే మరింత జాగ్రత్తగా ఆచి తూచి సినిమాలను చేస్తుంది.
ప్రెసెంట్ కీర్తి భోళా శంకర్ లో నటిస్తుంది.
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు చెల్లెలి పాత్రలో కీర్తి నటిస్తున్నట్టు ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక తాజాగా ఈ సినిమా నుండి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ లో కీర్తి పెళ్లి కూతురు గెటప్ లో సంతోషంగా కనిపిస్తుంది.వెన్నెల అనే పాత్రలో ఈమె నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఈ రోజు కీర్తి సురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఇక శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమా 2023 మార్చి 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు.







