పొత్తుల విషయంలో టీడీపీ( TDP ) కి పెద్ద చిక్కే వచ్చి పడింది.జనసేన పార్టీతో పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో సీట్ల పంపకాలు చేపట్టి, ఎన్నికల ప్రచారంలోకి దూసుకు వెళ్ళాలని టిడిపి అధినేత చంద్రబాబు భావించారు .
ఇక సీట్ల సర్దుబాటు ,అభ్యర్థుల ప్రకటన పూర్తి చేద్దామనుకునే సమయానికి బిజెపి అగ్రనేతల నుంచి చంద్రబాబుకు కబురు రావడం, ఆయన ఢిల్లీకి వెళ్లడం , పొత్తుల గురించి చర్చించడం వంటివి జరిగాయి.అయితే చంద్రబాబుతో చర్చించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) పొత్తులు , సీట్ల సర్దుబాటు విషయంలో ఏ క్లారిటీ ఇవ్వలేదు.
ఇటీవల ఆయన దీనిపై స్పందించేందుకు అంత తొందరేముంది అన్నట్లుగా మాట్లాడారు . అసలు పొత్తుల విషయంలో బిజెపి వైఖరి ఏమిటి అనేది టిడిపి, జనసేనలకు అంతు పట్టడం లేదు.తమతో సంప్రదింపులు చేయకపోతే ఈపాటికి సీట్లు సర్దుబాటు చేసుకుని, అభ్యర్థులను ప్రకటించుకుని, క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసుకునే వాళ్ళమని, కానీ బిజెపి వైఖరితో తాము ఏ విధంగానూ ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నామనే ఆందోళన టిడిపిలో కనిపిస్తోంది.
మొదటి నుంచి ఏపీలో వైసిపి ప్రభుత్వానికి బిజెపి అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తుండడం, జగన్ సైతం బిజెపికి అంతే స్థాయిలో మద్దతుగా నిలుస్తూ ఉండడం వంటివి టిడిపి గుర్తు చేసుకుంటుంది.జగన్ కు మేలు చేసే విధంగానే తమతో పొత్తు సంప్రదింపులు చేసి, ఏ నిర్ణయం తీసుకోకుండా ఇరకాటంలో పెట్టారా అనే అనుమానాలు టిడిపి అధినేతలో కనిపిస్తున్నాయి.మరోవైపు చూస్తే ఏపీ అధికార పార్టీ వైసిపి అభ్యర్థుల ప్రకటన తో పాటు, ఎన్నికల సభలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ జనాల్లోకి దూసుకు వెళ్తోంది.
కానీ తాము ఆ స్థాయిలో సభలు, సమావేశాలతో జనాల్లోకి వెళ్లాలంటే నియోజకవర్గాల అభ్యర్థుల ప్రకటన చేస్తేనే అవి అనుకున్న మేరకు సక్సెస్ అవుతాయని భావిస్తున్నాయి.ఇప్పటికే జనసేన టిడిపి( TDP, Jana Sena ) మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీ నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కొన్ని కొన్ని చోట్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి .తమ రెండు పార్టీలు ఏదో విధంగా సీట్లు సర్దుబాటు చేసుకుందాం అనుకున్నా. బిజెపి కనుక పొత్తు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ పార్టీకి సీట్లు కేటాయించాల్సి ఉండడంతో, ఎప్పటికప్పుడు తమ నిర్ణయాన్ని ఇటు చంద్రబాబు అటు పవన్ లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.ఈ పొత్తుల విషయంలో బిజెపి వైఖరి పై టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu )తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు.