హమ్మ దుర్మార్గులు... రూ.2 వేలు డిస్కౌంట్ ఇవ్వలేదని, రెండున్నర కిలోల బంగారం ఎత్తుకెళ్లారు!

తనకోపమే తన శత్రువు అన్నారు పెద్దలు.కామం తరువాత అత్యంత ప్రమాదికారి ఈ కోపమే.

 They Did Not Give A Discount Of Rs. 2 Thousand, They Took Away Two And A Half Ki-TeluguStop.com

కోపంలో మనిషి తన విచక్షణని కోల్పోతాడు.అందుకే పెద్దవాళ్ళు కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెబుతూ వుంటారు.

అయితే కోపంలో ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ వుంటారు.కొందరు గొడవ పడితే మరికొందరు మాత్రం ఎదుటి వ్యక్తిని ఎలాగున్నా నష్టపరచాలని అనుకుంటారు.

తాజాగా ముంబైలోని ఇద్దరు వ్యక్తులు ఇలానే అనుకున్నారు.అవును, తమకు డిస్కౌంట్ ఇవ్వనందుకు జ్యూవలరీ షాపులో చోరీ చేయాలని నిర్ణయించుకొని పధకం ప్రకారం చోరీ చేసారు.సదరు షాపులో దాదాపు రూ.1.2 కోట్ల విలువైన 2.4 కిలోల బంగారాన్ని దొంగతనం చేశారు.షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన దాని ప్రకారం.ఇద్దరు వ్యక్తులు తాము కొనుగోలు చేయాలనుకున్న ఆభరణాలపై రూ.2000 డిస్కౌంట్ ఇవ్వాలని సదరు షాపు యజమానిని కోరారట.అందుకు షాపు యజమాని ససేమిరా అన్నాడు.

ఈ క్రమంలో జరిగిన వాగ్వాదం వలన ఎలాగున్నా ఆ షాపుకి కన్నం పెట్టి లూటీ చేయాలనీ ఆ ఇద్దరు కేటుగాళ్లు పధకం పన్నారట.

ఈ క్రమంలోనే ఈ చోరీ చేసినట్లు అక్కడి వారు తెలిపారని పోలీసులు వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఇద్దరి వ్యక్తులను విచారిస్తున్నామని, వారు ఈ దొంగతనం చేయడానికి అసలు కారణం అదేనా? లేదంటే వారు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.పోలీసులు కేసు బుక్ చేసి ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube