బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే సంచలన నిర్ణయం తీసుకున్నారు.బ్రేగ్జిట్ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశంలో చెలరేగిన నిరసనలు,ఆందోళనలు,బ్రిటన్ పార్లమెంట్ లో ప్రతిపక్ష లేబర్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇలా అన్నీ కలగలవడం తో బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
జూన్ 7 శుక్రవారం నాడు ఆమె తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.బ్రెగ్జిట్ ఒప్పందంపై ఎంపీల మద్దతు దక్కించుకోవడంలో తీవ్రంగా విఫలమైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ దేశంకోసం నిబద్ధతతో పనిచేశానని, కానీ ఎంపీల మద్దతు కూడగట్టడం లో ఓటమి పాలయ్యానని కావున జూన్ 7న కన్జర్వేటివ్ పార్టీ నేతగా రాజీనామా చేయనున్నానని, కొత్త నాయకుడి ఎన్నిక ప్రక్రియ ఆ తరువాతి వారం మొదలుకానుందని ఆమె పేర్కొన్నారు.అప్పటివరకు తాను ప్రధానిగా కొనసాగుతానని తెలిపారు గత కొంత కాలంగా ఆమె రాజీనామా చేయనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా మే స్పందించలేదు.
కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోవడం తో మే ఈ సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్వయంగా ప్రకటించారు.