ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఒక్క రాష్ట్ర,జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సంబరాలు అంబరాన్ని అంటాయి.
సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల తో వైసీపీ పార్టీ ఘానా విజయం సాధించిన సంగతి తెలిసిందే.వైఎస్సార్ సీపీ అఖండ విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువిరిశాయి.
మిస్సోరిలోని సెయింట్ లూయిస్ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సైతం ఆటలు, పాటలతో తమ ఆనందాన్ని వ్యక్త పరిచారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేషధారణలో వారంతా చేసిన ఆట,పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ఈ సారి ఎన్నికల్లో ఎవరూ వూహించని విధంగా వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.మొత్తం 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో ఆ పార్టీ విజయాన్ని అందుకోవడం తో టీడీపీ పార్టీ 23 సీట్ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దీనితో ఏపీ లో వైసీపీ అధినేత జగన్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.ఈ నెల 30 న ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.