బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కత్రినా కైఫ్ పెళ్లి ప్రపోజల్ చేసింది.రియల్ లైఫ్ లో కాదులేండీ రీల్ లైఫ్ లో ఈ అమ్మడు సల్మాన్ కు ప్రపోజ్ చేసింది.
సల్మాన్,కత్రినా జంటగా ‘భారత్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రంజాన్ సందర్భంగా జూన్ 5 న ఈ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఆ ట్రైలర్ చాలా ఫన్నీ గా సాగుతుంది.పెళ్లి వయసు వచ్చింది ఇంకెప్పుడు చేసుకుంటావు అని కత్రినా అడిగితె అవును అని సల్మాన్ సమాధానం ఇస్తాడు.
నువ్వు చూడటానికి చాలా బాగుంటావు అని అంటే… ధన్యవాదాలు అని జవాబిస్తాడు.
నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితె.సల్మాన్ చెప్పిన సమాధానం విచిత్రంగా ఉంటుంది.అయితే కత్రినా ప్రపోజల్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ కావడం తో ఆ వీడియో వైరల్ గా మారింది.
అయితే ఈ చిత్రంలో సల్మాన్ 20 సంవత్సరాల వయసు నుంచి 70 ఏళ్ల వయసువరకు వివిధ రకాల గెటప్స్ లో కనిపించి అలరిస్తారని సమాచారం.మరి దీనిలో సల్మాన్ ఏ మాత్రం అలరిస్తాడో తెలియాలి అంటే జూన్ 5 వరకు వేచి ఉండాల్సిందే.