2024లో అధికారం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి నుండే వ్యూహా రచన చేస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175/175 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాలని నాయకులకు టార్గెట్ ఇచ్చారు.
అయితే జగన్ టార్గెట్ విషయంలో వైసీపీ నేతల్లో టెన్షన్ మెుదలైంది.జగన్ అంటున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం అవిధంగా పరిస్థితులు కనిపించడం లేదు.
తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే, కేబినెట్ మంత్రి మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తన మనుసులో ఉన్న మాటను బయటపెట్టారు.తాజాగా మీడియా ఇంటరాక్షన్‌లో, యాంటీ ఇన్‌కంబెన్స్ గురించి మాట్లాడాడు.“ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ఉందని అంగీకరించ”నని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్లే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు పడుతున్నాయంటూ వివరణ ఇచ్చారు.
ఇదే విషయమై ధర్మానపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి .“చివరి ప్రభుత్వం చేస్తున్న తప్పులు వైసీపీ నాయకులు గుర్తించారని, కళ్ళు తెరిచి చూస్తే, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత మిగితా నాయకులకు కూడా అర్థమవుతుందని అన్నారు.జగన్ చెబుతున్న సంస్కరణలేమిటి? అసాధారణంగా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం, రాష్ట్ర ఆర్థిక కోసం అప్పులు చేయడం ఆయన చెబుతున్న సంస్కరణ” అని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

అలాగే రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ధర్మాన స్పందించారు.“రోడ్లపై గుంతలు మేము తవ్వించామా? టీడీపీ ప్రభుత్వ హయాం నుంచే గుంతలు ఉన్నాయి.బహుశా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవి పెద్దవి అయ్యాయేమో” అంటూ వ్యాఖ్యనించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి ఇది నాలుగెళ్ళు అయింది.టీడీపీ హయాం నుంచి రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ వివరించారు.
ఇక వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నాలుగేళ్లుగా వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు.వైసీపీ బాధ్యతారహిత వ్యాఖ్యలు వైసీపీ నాయకులు అజ్ఞానంగా మాట్లాడుతున్నారని మండిపడింది.