యశోద సినిమాతో సమంత ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ సినిమాలో సరోగసీ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.
హరి హరీష్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.ముందు చిన్న బడ్జెట్ తో పూర్తి చెయాలని అనుకున్న ఈ మూవీని సమంత ఎంట్రీతో సినిమా బడ్జెట్ పెరిగిందని అంటున్నారు నిర్మాత.
ఇక ఈ సినిమా టైం లోనే సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డది.అయితే తమకెవరికి చెప్పకుండా సినిమా షూటింగ్ కి వచ్చిందని చెప్పారు.
ఇక సినిమా రిలీజ్ టైం లో తన హెల్త్ కండీషన్ బాగాలేకపోయినా సరే సమంత ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటుంది.ఇదివరకు సినిమా ప్రమోషన్స్ లో ఎంతో యాక్టివ్ గా పాల్గొనే సమంత ఇప్పుడు అన్ హెల్తీ నెస్ వల్ల చాలా డల్ గా కనిపించింది.
అయితే సమంతని అలా చూసి చలించి పోయిన ఆమె ఫ్యాన్స్ సమంత కోసమైన సరే సినిమా హిట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.ఇప్పటికే సుదర్శన్ 35 ఎం.ఎం థియేటర్ దగ్గర సమంత ఫ్యాన్స్ భారీ పోస్టర్స్ తో సందడి చేస్తున్నారు.వీరి ప్రేమని చూసి సమంత ఉప్పొంగిపోతుంది.