టెస్లా లోపల సీఫుడ్ మీల్ వండిన మహిళ.. ఇదేం పిచ్చి పని అంటున్న నెటిజన్లు...

కొందరు వ్యక్తులు అగ్నిపర్వతం లేదా బీచ్ వంటి వింత ప్రదేశాలలో ఆహారాన్ని వండటానికి ఇష్టపడతారు.వారి ఆ వంటల వీడియోలు సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంటారు.

 The Woman Who Cooked Seafood Meal Inside The Tesla Netizens Are Saying This Is A-TeluguStop.com

అయితే తాజాగా ఒక మహిళ తన కారులో సీఫుడ్ వంటకం ప్రిపేర్ చేసింది.ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్న ఆ వీడియోలో మహిళ తన ఖరీదైన, ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ కారు టెస్లాలో( Tesla ) ఫుడ్ ప్రిపేర్ చేసింది.మహిళ కారులో వీడియో కెమెరా ఉంచి వంటకం ఎలా తయారు చేసిందో చూపించింది.

బంగాళదుంపలు, వెల్లుల్లిని కత్తిరించడానికి ఆమె ఒడిలో ఒక బోర్డు పెట్టుకుంది.కారులో ఒక చిన్న విద్యుత్ కుండ, గ్రిల్ కూడా ఉంది.ఆమె కుండలో బంగాళాదుంపలను( Potatoes ) ఉడకబెట్టింది.గ్రిల్‌పై కొన్ని రొయ్యలను కాల్చింది.ఆమె బంగాళాదుంపలను తీసి వాటిపై కొన్ని సుగంధ ద్రవ్యాలు వేసింది.ఆపై ఒక గిన్నెలో కొన్ని మసాలా దినుసులు కలిపింది.

రొయ్యలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, కుండలో కొంత వెన్నను ఉంచింది.ఆమె వెన్నకు వెల్లుల్లి, మసాలాలు( Garlic , spices ), కొద్దిగా నిమ్మరసం జోడించింది.

కొన్ని సాసేజ్‌లను కట్ చేసి వాటిని కూడా గ్రిల్ చేసింది.ఆపై కుండలో ప్రతిదీ మిక్స్ చేసింది.

బోర్డును ప్లాస్టిక్‌తో కప్పి ప్లేట్‌గా ఉపయోగించింది.బోర్డు మీద కొన్ని నిమ్మకాయ ముక్కలను ఉంచి, ఆపై వాటి పైన సీఫుడ్ మిశ్రమాన్ని ఉంచింది.రొయ్యల మీద మరికొంత నిమ్మరసం పిండుకుని ఆ వంటకం తినేసింది.ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 40 లక్షల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తూ కారులో సీఫుడ్ వాసన చాలా రోజులు అలాగే ఉంటుందని ఆ వాసన ఎలా భరిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.కొందరు కారులోని తెల్లటి సీట్లకు ఆహారం మరకలు అంటుకుంటాయని అన్నారు.

కారులో కాకుంటే బయట చేసుకోకపోవచ్చు కదా ఇదేం పిచ్చి అని మరికొందరు పేర్కొంటున్నారు.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube