రూ.2లక్షలు భూమిలో పాతిపెట్టి మర్చిపోయిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే..?

డబ్బును భద్రంగా ఉంచుకోవాలంటే బ్యాంకులో డిపాజిట్ చేయడమే మంచి మార్గమని చాలా మంది అనుకుంటారు.కానీ అందరూ ఈ ఆలోచనతో ఏకీభవించరు.

 The Woman Buried Rs. 2 Lakhs In The Ground And Forgot What Did The Police Do,-TeluguStop.com

బ్యాంకులో వేసినా డబ్బులు పోయే ప్రమాదముంటుందని పెద్దగా చదువుకొని వారు భావిస్తుంటారు.బయ్యారంలోని జగ్గు తండా అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న తమ్మిశెట్టి రంగమ్మ కూడా ఇలానే భావించింది.

కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని తెలిసినవారు సలహా ఇచ్చినా ఆమె అందుకు ఒప్పుకోలేదు.బ్యాంకులో తన మనీని ఎవరైనా దొంగిలించవచ్చని భయపడింది.

ఆమెకు గ్రామంలో ఒక చిన్న దుకాణం ఉంది, అక్కడ ఆమె కిరాణా సామాన్లు అమ్ముతోంది.కొన్నేళ్లుగా ఆమె రూ.2 లక్షల క్యాష్ వెనకేసింది.

Telugu Bank Deposit, Hidden Cash, Safety-Latest News - Telugu

వాటిని బ్యాంకు( Bank )లో కాకుండా పురాతన కాలంలో లాగా రహస్య ప్రదేశంలో దాచాలని నిర్ణయించుకుంది.క్యాష్‌ను ప్లాస్టిక్ పెట్టె( Plastic box )లో పెట్టి తన ఇంటి ప్రాంగణంలో పాతిపెట్టింది.అక్కడ ఎవరికీ దొరకదని అనుకుంది.

తర్వాత ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లింది.తిరిగి వచ్చాక డబ్బులు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంది.

కానీ డబ్బును ఎక్కడ పాతిపెట్టిందో ఆమెకు సరిగ్గా గుర్తులేదు.ప్రాంగణంలో ప్రతిచోటా వెతికింది, కానీ కనిపించలేదు.

దాంతో చాలా భయపడింది.తన వద్ద ఉన్న డబ్బును ఎవరో దొంగలు తవ్వి ఎత్తుకెళ్లి ఉంటారనే అనుమానాలు ఆమెను బాగా వేధించాయి.

Telugu Bank Deposit, Hidden Cash, Safety-Latest News - Telugu

చివరికి చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్‌( Police station )కి వెళ్లి ఫిర్యాదు చేసింది.తన ఇంట్లో డబ్బు దాచానని, అయితే ఇప్పుడు అది పోయిందని పోలీసులకు తెలిపింది.ఆమె మాటలు విని పోలీసులు అయోమయంలో పడ్డారు.డబ్బును బ్యాంకులో ఉంచకుండా ఎందుకు పాతిపెట్టిందని వారు నోరెళ్లబెట్టారు.ఆమె ఇంటికి వెళ్లి విచారించాలని నిర్ణయించుకున్నారు.ఆమె తన ప్రాంగణం చూపించమని అడిగారు.

ప్లాస్టిక్ పెట్టె దొరుకుతుందనే ఆశతో వేర్వేరు చోట్ల తవ్వడం ప్రారంభించారు.కొంత సమయం తరువాత, వారు చివరకు కనుగొన్నారు.

అది ఇప్పటికీ మట్టి కుప్ప కింద పాతిపెట్టబడింది.డబ్బు లోపలే గుడ్డలో చుట్టి ఉంది.

వారు పెట్టెను తీసి తెరిచారు.డబ్బులను లెక్కించి రూ.2 లక్షలుగా నిర్ధారించారు.ఆ డబ్బును రంగమ్మకు తిరిగి ఇచ్చేశారు.

బ్యాంకు ఖాతా తెరిచి అక్కడ డబ్బు జమ చేయాలని కూడా వారు ఆమెకు సూచించారు.భూమిలో పాతిపెట్టడం కంటే ఇది సురక్షితమైనదని, సులభమని వారు ఆమెకు చెప్పారు.

ఆమె తన డబ్బును బ్యాంకులో ఉంచితే కొంత వడ్డీ కూడా పొందవచ్చని వివరించారు.రంగమ్మ డబ్బు తిరిగి పొందినందుకు ఎంతో సంతోషించింది.

సహకరించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.వారి సలహాలు కూడా విని బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తానని చెప్పుకొచ్చింది.

కానీ ఆమె బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేసిందో లేదో ఇంకా తెలియ రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube