వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కలేదని కన్నీళ్లు పెట్టుకున్న వెస్టిండీస్ ప్లేయర్లు..!

భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం అయింది.ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ పోరు ప్రారంభమైంది.

 The West Indies Players Shed Tears For Not Getting A Place In The Odi World Cup-TeluguStop.com

టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.టాస్ ఓడిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది.

అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లకు చోటు దక్కలేదు.రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన వెస్టిండీస్( West Indies ) కు టోర్నీలో చోటు దక్కకపోవడం ఇదే మొదటిసారి.

Telugu Daren Sammy, India, Netherlands, Nicholas Pooran, Odi Cup, Scotland-Sport

స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే జట్ల చేతిలో ఘోర పరాజయాలను చవిచూడడం వల్ల వెస్టిండీస్ జట్టు ఈసారి జరిగే టోర్నీలో చోటు సంపాదించడంలో విఫలమైంది.గతంలో వెస్టిండీస్ జట్టు అంటే తిరుగులేని జట్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జట్టు టోర్నీలో లేకపోవడంతో క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర నిరాశకు గురయ్యారు.వెస్టిండీస్ జట్టు ఈ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించడంలో ఎందుకు విఫలమైందో అనే కారణాలు పరిశీలిద్దాం.

Telugu Daren Sammy, India, Netherlands, Nicholas Pooran, Odi Cup, Scotland-Sport

వెస్టిండీస్ జట్టులో నికోలస్ పూరన్, సునీల్ నరైన్, అండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్ మేయర్ లాంటి కీలక ఆటగాళ్లు ఉన్నా కూడా.వీళ్లు నిలకడగా ఫామ్ లో లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.అంతేకాదు 2014లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కు, వెస్టిండీస్ జట్టు ఆటగాళ్లకు మధ్య జరిగిన వాగ్వాదం క్రికెట్ జట్టును ఆర్థికంగా కింద పడేసింది.

ఈ విషయాన్ని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సమీ( Daren Sammy ) గత ఏడాది బయట పెట్టాడు.భారత అగ్రశ్రేణి స్టార్లు ఒక సంవత్సరానికి సంపాదిస్తున్న దానిలో 20% మాత్రమే వెస్టిండీస్ క్రికెటర్లు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అందుకే వెస్టిండీస్ కీలక ఆటగాళ్లు వెస్టిండీస్ కోసం ఆడే కంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే టి20 పోటీలలో ఆడడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని భావిస్తున్నట్లు డారెన్ సమీ చెప్పాడు.అందుకే ఐపీఎల్( IPL ) లాంటి టోర్నీలలో గాయాలైన కూడా తెగించి ఆడెందుకు కీలక ఆటగాళ్లు మొగ్గు చూపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube