ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ సుదీర్ఘంగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో సిసోడియా తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు.లిక్కర్ పాలసీలో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన కోర్టుకు తెలిపారు.
కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్ కు, సిసోడియాకు సంబంధం లేదని పేర్కొన్నారు.సిసోడియాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న న్యాయవాది సింఘ్వి ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్నారని తెలిపారు.
ఈ క్రమంలో సిసోడియాకు బెయిల్ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.మరోవైపు సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.







