పర్యాటకులను పట్టించుకోకుండా వెళ్లిపోయిన పులి.. గుండెలు అదిరిపోయాయ్

అడవిలోకి వెళ్లాలంటే చాలా మందికి భయం పుడుతుంది.ఎప్పుడు ఏ క్రూర జంతువు తమ మీదికి వచ్చి దాడి చేస్తుందో అనే ఆందోళన వెంటాడుతుంటుంది.

 The Tiger Left Without Paying Attention To The Tourists, Viral Latest, News Vira-TeluguStop.com

అయితే కొందరు మాత్రం సాహస యాత్రలు చేస్తుంటారు.పులి, సింహం, ఏనుగు, చిరుతలు ఉండే ప్రాంతాల్లోకి ధైర్యంగా వెళ్తుంటారు.

ముఖ్యంగా సఫారీ టూర్లు చేసే వారికి క్రూర మృగాలను దగ్గర నుంచి చూడాలని ఉత్సాహం ఉంటుంది.ఒక్కోసారి అనుకోని ప్రమాదాలు జరుగుతుంటాయి.

అయినప్పటికీ పర్యాటకులు సఫారీ టూర్లకు వెళ్లడం తగ్గించరు.మన దేశంలోనూ ఎన్నో టైగర్ రిజర్వ్ ఫారెస్టులు ఉన్నాయి.

అందులో ముఖ్యమైనని మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఒకటి.అందులో ఇటీవల ఆశ్చర్యకర ఘటన జరిగింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

పన్నా టైగర్ రిజర్వ్‌లో నిత్యం పర్యాటకులు వెళ్తుంటారు.అక్కడ క్రూర మృగాలతో ఫొటోలు తీసుకుంటుంటారు.ఇదే కోవలో ఇటీవలో అరుదైన దృశ్యం కనిపించింది.

ఇటీవల అడవిలో పర్యాటకులు జీపులో వెళ్లారు.ఓ వంతెన వద్ద ఓ పులి నాలుగు పిల్లలతో కనిపించింది.

సాధారణంగా ఇలాంటి క్రూర మృగాలు మనుషులు కనిపించగానే దాడి చేస్తాయి.ఆశ్చర్యకరంగా ఆ పులి ఎలాంటి దాడి చేయలేదు.

కేవలం కొన్ని అడుగుల దూరంలో ఆ పులి ఆ పర్యాటకులకు అత్యంత సమీపంలో నుంచి వెళ్లింది.పర్యాటకులు ఉత్సాహంగా ఆ పులులతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు.దీంతో క్రూర మృగాలు ఎవరిపైనా అకారణంగా దాడి చేయవని, వాటికి ఆటంకం కలిగించనంత వరకు అవి వాటి పని అవి చూసుకుంటాయని స్పష్టం అయింది.@Chaturvedikk17 అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube