బాబు యాత్ర దేనికోసం ? ప్రజల కోసమా పార్టీ కోసమా ?

హడావుడిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు హడావుడిగా చేస్తున్న పాదయాత్ర ఇప్పుడు దేనికోసం అనే ప్రశ్న తలెత్తుతోంది.ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ చేపడుతున్న ప్రజా చైతన్య యాత్ర చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు బాగా ఉపయోగపడుతుంది.

 The Story About Babu Praja Chaitanya Yatra-TeluguStop.com

ఈ యాత్ర ద్వారా టిడిపికి గాని, చంద్రబాబు కు గాని, కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది పక్కన పెడితే, ఇందులో అనేక రాజకీయాలు బయటకు వస్తున్నాయి.గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో నిస్తేజం అలుముకుంది.

ఒకవైపు ఐటీ దాడులతో పార్టీ క్యాడర్ ఆందోళనలో ఉంది.

టిడిపి పని ఇక అయిపోయినట్టే అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అతి సమీపంలో ఉండడంతో పార్టీలో తిరిగి ఉత్సాహం నింపాలంటే ఏదో ఒకటి చేయాలి.అలా కాకుండా ఎప్పటిలాగే ఉంటే పార్టీ కేడర్ మరింతగా దెబ్బతింటుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇప్పుడు చైతన్య యాత్రను మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది.

అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ లాభపడేది కొంతవరకు మాత్రమే ఉంది.వైసీపీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు.పరిపాలనపై జగన్ ఇంకా పట్టు సాధించలేదు.అయినా ఇప్పటికే జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలను, పథకాలను అమలుచేసి తానేమిటో నిరూపించుకున్నారు.

Telugu Apcm, Ap Muncipall, Babu, Tdp Chandrababu, Storybabu-Political

ఇదే సమయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీసాడని అపవాదు కూడా మూటకట్టుకున్నాడు.ప్రభుత్వ లోపాలను హైలెట్ చేసుకోవడమే తమ ధ్యేయంగా ఇప్పుడు చంద్రబాబు యాత్ర మొదలు పెట్టారు.ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 35 శాతం స్థానాలను తాము దక్కించుకుంటే తెలుగుదేశం పార్టీ బలంగా నిలబడుతుందని అంచనా వేస్తున్నాడు.అదే 50% సీట్లు సాధిస్తే వైసీపీ పై ప్రజా వ్యతిరేకత ఉందని, నిరూపించడం తో పాటు తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందనే విషయాన్ని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.

Telugu Apcm, Ap Muncipall, Babu, Tdp Chandrababu, Storybabu-Political

అందుకే ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర కు శ్రీకారం చుట్టారు.మరోవైపు ఐటీ దాడుల భయం కూడా ఉండడంతో ప్రజల్లో ఉంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినా ప్రభుత్వం తాను ప్రజా ఉద్యమాలు చేస్తున్నాను కాబట్టి కక్షసాధింపు చేస్తుందని చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని బాబు భావిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube