హెచ్1-బీ ఆలస్యానికి అసలు రీజన్ ఇదీ..!!!

ట్రంప్ అధికారం చేపట్టిన నాటినుంచీ నేటి వరకూ కూడా హెచ్ -1 బీ వీసాల విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

తమ వారికి ఉద్యోగాలలో అవకాశాలు పోతున్నాయి అంటూ ట్రంప్ ఎన్నో సార్లు ఆరోపణలు చేశారు కూడా.

అయితే ప్రతిభ ఉన్న వారికి పట్టం కడుతామని చెప్పిన ట్రంప్ ఆ దిశగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు.ఇదిలాఉంటే

అసలు హెచ్ -1 బీ వీసాలు ఆలస్యం అవ్వడానికి ,లేదా నిరాకరించడానికి అసలు కారణాలు ఇవే అంటున్నారు.2015లో హెచ్1-బీ వీసా అప్రూవల్ రేటు 96 శాతం ఉండగా.అది ఇప్పుడు అంటే 2018 కి 85 శాతానికి పడిపోయిందట.

కంపెనీలను రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్(ఆర్‌ఎఫ్ఈ) డిమాండ్ చేస్తుండటంతో వీసా జారీల విషయంలో ఆలస్యమవుతోందని.అయితే ఈ ఆలస్యానికి ముఖ్య కారణాలని కూడా అధికారులు తెలిపారు.

Advertisement

1.వీసా కోసం అభ్యర్ధన చేసుకున్న వారు డిగ్రీకు పనిచేస్తున్న ఉద్యోగానికి వ్యత్యాసం ఉండటం మాములుగానే ఎక్కువ మంది వీసాలు ఆలస్యానికి నిరాకరణకి గురవుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.2.వీసా కోసం అప్లై చేసుకున్న వారికి కంపెనీకి మధ్య ఉన్న సంభందాన్ని నిరూపించడంతో అనేక కంపెనీలు వైఫల్యం అయ్యాయట.3.వీసా ని అభ్యర్ధించిన కాల వ్యవహిలో ఉద్యోగికి ఆఫ్‌సైట్ వర్క్‌ను కంపెనీ కల్పిస్తుందా అన్న దానిపై కంపెనీల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం 4.

ఉద్యోగి ఆ ఉద్యోగినికి అర్హుడా కాడా అనే అంశాలు వీసా రాకపోవడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు