గత ఏడాది జారీ చేసిన వీసాలలో అధికశాతం వీసాలు పొందిన వారిలో భారతీయులే ఎక్కువ మంది ఉన్నారని యూకే ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.నైపుణ్యం కలిగిన నిపుణులు ,విద్యార్ధులే ఇందులో ఎక్కువ మంది అని ప్రకటించింది.
యూకే లెక్కల ప్రకారం 2017తో పోల్చితే గతేడాది జారీ చేసిన టైర్-2 వీసాల సంఖ్య 3,023కు అమాంతం పెరిగింది.అంతేకాదు స్టూడెంట్ వీసాల సంఖ్య కూడా 35 శాతంకి చేరుకుంది.
ఈ దేశం వీసాలని పొందే దేశాలలో చైనా ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటుంది.అయితే గతేడాది చైనాకు 99,723 స్టూడెంట్ వీసాలు జారీ చేసినప్పటికీ.అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే కేవలం 13 శాతమే పెరుగుదల కనిపించింది
అయ్తీ తాజాగా యూకే జారీ చేసిన మొత్తం విజిటర్ వీసాలలో సుమారు 48 శాతం వాటా చైనా భారత్ లది కావడం విశేషం.అయితే యూకే నుంచి నికర వలసలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని, కాబట్టి బయటి దేశాల నుంచీ వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది.
తాజా వార్తలు