బ్రష్ కట్టర్ ను పొలంలో ఉపయోగించే విధానం.. దీంతో కూలీల ఖర్చు ఆదా..!

వ్యవసాయ రంగంలో కూలీల కొరత ప్రధాన సమస్యగా మారిపోయింది.పొలంలో కలుపు తీసేందుకు కూలీలు దొరకక రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 The Method Of Using Brush Cutter In The Farm This Saves Labor Cost , Cutting Gr-TeluguStop.com

అయితే కలుపును నివారించడం కోసం కొన్ని పిచికారి మందులు అందుబాటులో ఉన్న వాటితో తాత్కాలికంగానే కలుపు పోతుంది.మళ్ళీ కొన్ని రోజులకు కలుపు విపరీతంగా పెరుగుతూ తీవ్ర నష్టాలను తెచ్చిపెడుతోంది.

ఈ సమస్యకు పెట్టేందుకు బ్రష్ కట్టర్ ( Brush cutter )అందుబాటులోకి వచ్చింది.దీనితో కలుపు తీసే కూలీల ఖర్చు దాదాపుగా ఆదా అవుతుంది.దీంతో రైతులు చక్కగా కలుపు తీయడమే కాకుండా, పశువులకు అవసరమయ్యే గడ్డి కోయడం, వరి పంట కోయడం ( Cutting grass, harvesting paddy )లాంటి కోతలు కూడా చేయవచ్చు.ఉద్యానవన తోటల్లో కొమ్మల కతరింపులు కూడా చేపట్టవచ్చు.

ఈ బ్రష్ కట్టర్ లో రకాల బ్లేడ్స్ ఉంటాయి.మొదటి బ్లేడ్ కి 80 పళ్ళు ఉంటాయి.10 ఇంచుల డై మీటర్ ఉంటుంది.దీనితో పశువుల గడ్డి, పంట కోయవచ్చు.

ఈ బ్లేడును నేలకు, రాళ్ళకు గట్టిగా తగలకుండా జాగ్రత్తగా ఉపయోగించాలి.ఈ బ్లేడ్ కేవలం ఎడమ వైపు గడ్డి కత్తిరిస్తుంది.

ఈ బ్లేడును వీడర్ బ్లేడ్ అంటారు.ఈ కట్టర్ కు వీడర్ బ్లేడ్ తో పాటు సీయిల్డ్ వస్తుంది.

దీని సహాయంతో సన్నగా ఉండే పంటలలో కలుపు, కోతలకు ఉపయోగించుకోవచ్చు.ఈ బ్లేడ్ కు మూడు పళ్ళు మాత్రమే ఉంటాయి.

ఈ బ్లేడ్ నేలకు, రాళ్లకు తగిలిన ఏమి కాదు.ఈ బ్లేడ్ రెండు వైపులా గడ్డిని కట్ చేస్తుంది.

ఇక ఈ కట్టర్ కు టిల్లర్ వీడర్ ఉంటుంది.దీనితో మెత్తటి పొలంలో కలుపు తీయవచ్చు.

ఈ పరికరం వల్ల దాదాపుగా కూలీల ఖర్చు ఆదా అయినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube