Malaika Arora : ప్రియుడి బర్త్ డే వేడుకలో ఖరీదైన డ్రెస్ ధరించిన మలైకా.. ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే?

తెలుగు ప్రేక్షకులకు బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ( Malaika Arora )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది.

 Arjun Kapoor Birthday Bash Do You Know Malaika Arora Dress Cost-TeluguStop.com

కాగా మలైక అరోరా బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.తెలుగులో మొదటిసారిగా మహేష్ బాబు అతిధి సినిమాలో ప్రత్యేక సాంగ్ చేసిన మలైకా అరోరా.

ఆ తరువాత పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక అనే పాటలో చిందులు వేసి భారీగా గుర్తింపు తెచ్చుకుంది.ఇకపోతే మలైక బాలీవుడ్ నటుడు సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ( Arbhaz Khan )ను 1998 లో ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Telugu Arjun Kapoor, Cost, Malaika Arora-Movie

అనంతరం మనస్పర్థల కారణంగా 2016 లో విడిపోతున్నామని ప్రకటించిన ఈ జంట 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.వీరికి ఓ కుమారుడు అర్షాన్ ఖాన్( Arshan Khan) .కాగా, విడాకుల తర్వాత మలైక ఆమె తనకంటే 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్( Arjun Kapoor ) తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది మలైక.

ఇది ఇలా ఉంటే ఇటీవల అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే.అందుకు సంబందించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Telugu Arjun Kapoor, Cost, Malaika Arora-Movie

అర్జున్ కపూర్ బర్తడే సందర్భంగా ప్రియురాలు మలైకా అరోరా స్టార్ ప్రింటెడ్ బాడీకాన్ డ్రెస్‌లో దిల్ సే చిత్రంలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ఛైయ్యా ఛైయ్యాకు డాన్స్ చేసి అందర్నీ ఫిదా చేసింది.కాగా అర్జున్ కపూర్ పుట్టినరోజు వేడుకలో డ్యాన్స్‌తో ఆకట్టుకున్న మలైకా అరోరా బాడీకాన్ డ్రస్ ఎంత అనే విషయం పై చర్చలు జరుగుతున్నాయి.కాగా ఆ డ్రెస్ ధర రూ.99వేలు.మలైకా అరోరా బాడీకాన్ డ్రెస్ స్పానిష్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ లోవేకి చెందిన రిబ్బెడ్ కాటన్ జెర్సీలో ఆంథూరియం ట్యాంక్ డ్రెస్ అంటారు.స్లీవ్‌లెస్ వైట్‌ గౌన్‌పై ఎరుపు రంగు ఆంథూరియం పువ్వులను అందంగా డిజైన్‌ చేశారు.

మలైకా వైట్‌ అండ్‌ రెడ్‌ గౌనులో మెరిసిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube