సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి( MLA Jagga Reddy ) వ్యవహారం గత కొంతకాలంగా ఎవరికీ అంతు పట్టడం లేదు.సొంత పార్టీలో ఆయన వ్యవహరశైలిపైనా జోరుగా చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ లో తనకు తగిన ప్రాధాన్యం లేదని చెబుతూనే, తాను పార్టీ మారేది లేదనే ప్రకటనలు చేస్తున్నారు.అదే సమయంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) పైన ప్రశంసలు కురిపిస్తూ, అందరిని గందరగోళానికి గురి చేస్తున్నారు.
చాలా కాలం పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ, మీడియాను దూరం పెట్టిన జగ్గారెడ్డి కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి రైలులో వెళ్లి రాహుల్ గాంధీతో( Rahul gandhi )భేటీ అయ్యారు.ఆ భేటీ తర్వాత ఆయనలో ఎక్కడా ఉత్సాహం అయితే కనిపించడం లేదు.
దీంతో ఆయన కాంగ్రెస్ ను వీడబోతున్నారని, అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.ఈ రకమైన ప్రచారం జరుగుతున్నా, జగ్గారెడ్డి మాత్రం మౌనంగానే ఉండడం తో ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
ఇదిలా ఉంటే ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ జగ్గారెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకోవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.దీంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా అయోమయంలో పడింది.అసలు జగ్గారెడ్డి మనసులో ఏముంది ? ఎందుకు ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు ? బీఆర్ఎస్ లో ఆయన చేరుతున్నారా లేక కాంగ్రెస్ లోనే ఉంటున్నారా అనే ప్రశ్నలు ఎన్నో తలైతున్నాయి.అయితే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి జగ్గారెడ్డి అసంతృప్తితోని ఉన్నారని ,తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, పార్టీ కార్యక్రమాలకు సరిగా పిలవడం లేదనే అసంతృప్తితో చాలాకాలం పాటు గాంధీ భవన్ లో అడుగు పెట్టలేదు.
ఇదిలా ఉంది తాను పార్టీ మారుతున్నాను అనే ఏ ప్రకటన జగ్గారెడ్డి చేయకముందే, సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అధిష్టానానికి డిమాండ్ వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉంటే సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ పార్టీ కోసం బాగానే కష్టపడుతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు.
ఒకవేళ చింతా ప్రభాకర్ కు టికెట్ ఇచ్చే అవకాశం లేకపోతే, ఆ స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలి తప్ప, జగ్గారెడ్డిని మాత్రం ఎత్తు పరిస్థితుల్లో ,చేర్చుకోవద్దనే డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది.