క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఇండియాలోనే నిర్వహించనున్న నెక్స్ట్ ఐపీఎల్!

భారతీయ క్రికెట్ ప్రియులకు బీసీసీఐ తీపి కబురు అందించింది.ఐపీఎల్ 15వ సీజన్ ఇండియాలోనే నిర్వహించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జే షా తాజాగా స్పష్టం చేశారు.

 The Good News For Cricket Lovers Is That The Next Ipl Will Be Held In India Cric-TeluguStop.com

సరికొత్త జట్ల రాకతో 15వ సీజన్ మరింత రసవత్తరంగా ఉంటుందని ఆయన అన్నారు.త్వరలోనే మెగా వేలం నిర్వహిస్తామని తెలిపారు.

కొత్త కాంబినేషన్లు ఎలా ఉండబోతున్నాయో చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.

నిజానికి ఐపీఎల్ 2021 ఇండియాలోనే ప్రారంభించారు.

కానీ భారతదేశంలో కరోనా వ్యాప్తి విపరీతంగా ఉండటంతో టోర్నమెంట్ ను అర్ధాంతరంగా రద్దుచేశారు.అయితే మలి దశ ఐపీఎల్ ను సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో నిర్వహించారు.

ఈ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్ ను చిత్తు చిత్తుగా ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ కప్పును ముద్దాడింది.ధోనీ సారథ్యంలో నాలుగో సారి ఐపీఎల్ కప్ గెలవడం విశేషం.

Telugu Bcci, Cricket Fans, Indian, Teams-Latest News - Telugu

అయితే వచ్చే సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ధోనీ తన చివరాఖరి టీ20 చెన్నైలో జరిగితే బాగుంటుందని భావిస్తున్నారు.ఈ విషయాన్ని తాజాగా ఆయన ప్రస్తావించారు.ఏప్రిల్ ఐపీఎల్ 2022 జరగనుందని.ఆ టోర్నమెంట్ కు తాను సన్నద్ధమవుతున్నానని చెప్పారు.అలాగే తన చివరి మ్యాచ్ తన హోంటౌన్ లో జరిగేలా ప్లాన్ చేసుకుంటానన్నారు.

తన లాస్ట్ వన్డే రాంచీలో జరిగిందని.లాస్ట్ టీ20 కూడా చెన్నైలోనే జరగాలని ఆశిస్తున్నాను అని అన్నారు.

అయితే ఐపీఎల్ ముగియగానే టీ20 ప్రపంచకప్, ఆపై న్యూజిలాండ్‌తో భారత సిరీస్ ప్రారంభమైంది.ఈ క్రమంలో కరోనా భయాలను పక్కన పెట్టి క్రికెట్ ప్రియులందరూ కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియానికి విచ్చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 ఇండియాలోనే నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ సీజన్ లో అహ్మదాబాద్, లక్నో అనే రెండు కొత్త టీంలు జాయిన్ కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube