రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) ప్రసంగంపై విపక్షాల విమర్శలు అర్థరహితమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) అన్నారు.రాజకీయ అంశాలకు సంబంధం లేకుండా ప్రగతి గురించి రాష్ట్రపతి వివరించారని తెలిపారు.
తొమ్మిదిన్నరేళ్ల తమ పాలనలో తాము చేసిన అభివృద్ధిని వివరించారని కిషన్ రెడ్డి తెలిపారు.గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి తమ పాలనలో చేశామన్నారు.
పంచాయతీ రాజ్ ( Panchayat Raj ) వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీల కాలపరిమితి ఈ రోజుతో ముగుస్తుందని తెలిపారు.73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం సకాలంలో ఎన్నికలు జరగాలని కిషన్ రెడ్డి తెలిపారు.