ఎన్నికల ప్రచారంలో భాగంగా గులాబీ బాస్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
బీఆర్ఎస్ కు బాస్ తెలంగాణ ప్రజలేనన్న కేసీఆర్ తమ పార్టీ చరిత్ర ప్రజల ముందే ఉందని తెలిపారు.తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అయితే ఉన్న తెలంగాణను ముంచిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు.
రైతుబంధు వేస్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారన్న కేసీఆర్ మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు అంటున్నారన్నారు.అయితే వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ సరిపోతుందా అని ప్రశ్నించారు.
రైతులకు మేలు చేసేందుకే ధరణి పథకం తెచ్చామన్న కేసీఆర్ రైతుల భూమిపై రైతుకే అధికారం ఇచ్చామని పేర్కొన్నారు.ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు.
ఒకవేళ ధరణి తీసేస్తే మళ్లీ పైరవీకారుల చుట్టూ తిరగాల్సిందేనని స్పష్టం చేశారు.