బిజెపి, జనసేన రెండు పార్టీలు కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తాయని అనేక సందర్భాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.అంతే కాదు బిజేపి రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురు చూస్తున్నానని ప్రకటించారు.
దీంతో 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, పొత్తు కుదరని పక్షంలో టిడిపిని కలుపుకు వెళ్తాయని ఒక అభిప్రాయానికి వచ్చేశారు. పవన్ ఈ విధమైన ప్రకటనలు చేస్తునే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన పార్టీ తోనూ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
బిజెపి కంటే జనసేన తోనే ఎక్కువ ప్రయోజనం అని ఆయన భావించి తమతో పొత్తు పెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ వ్యవహారం బీజేపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తోంది.
అందుకే బహిరంగంగానే టీడీపీతో పొత్తు ఉండదని జనసేన ,బీజేపీ మాత్రమే కలిసి పోటీ చేస్తాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటనలు చేస్తున్నారు.అయితే ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది.
టిడిపితో పొత్తు పెట్టుకోవాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చడం తమకు ఇష్టం లేదని ప్రకటనలూ చేస్తున్నారు.
దీంతో ఖచ్చితంగా జనసేన , బీజేపీ తోనే కాకుండా, టీడీపీ తోనూ పొత్తు కోసం ఎదురుచూపులు చూస్తోంది అనే విషయం పై అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.ముఖ్యంగా బిజెపి ఈ విషయంలో మరిన్ని అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
పవన్ కి టిడిపికి దగ్గర అయితే బిజెపి కోలుకోని విధంగా దెబ్బ తింటుంది అనే ఉద్దేశంతోనే పదేపదే జనసేన తమతో కలిసి ఉంటుంది అని, తామంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపి ని కలుపు వెళ్ళేది లేదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు.

ఈ విషయంలో పవన్ సైతం కన్ఫ్యూజన్ కి గురవుతున్నారట.ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపితో పొత్తు అనివార్యమని ఆయన భావిస్తున్నారు.కానీ బీజేపీ టీడీపీ పొత్తుకు అంగీకరించకపోవడంతో ఆ పార్టీ తో తెగతెంపులు చేసుకోవాలని సూచనలు పవన్ కు అందుతున్నా… బీజేపీతో శత్రుత్వం పెంచుకోవడం ద్వారా ఎంతటి విపత్కర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే భయం పవన్ కూ ఉంది.
అందుకే ఈ విషయంలో సైలెంట్ గా ఉంటుండగా బీజేపీ మాత్రం పవన్ పై అనుమానపు చూపులు చూస్తోంది.